నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవల విస్తరణ
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరించనున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని ఇది వరకే ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి ఈ మేరకు ఆరోగ్య శ్రీ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరించనున్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సేవలను ప్రారంభిస్తారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద వెయ్యి రూపాయల ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తున్నారు. ఇప్పుడు మరో […]
ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరించనున్నారు. వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తామని ఇది వరకే ప్రభుత్వం ప్రకటించింది. నేటి నుంచి ఈ మేరకు ఆరోగ్య శ్రీ సేవలను మరో ఆరు జిల్లాలకు విస్తరించనున్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సేవలను ప్రారంభిస్తారు.
ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద వెయ్యి రూపాయల ఖర్చు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తున్నారు. ఇప్పుడు మరో ఆరు జిల్లాల్లో ఇది అమలులోకి వస్తోంది. ఇకపై కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.
ఏపీలో మొత్తం 2,200 వైద్య సేవలకు ఆరోగ్య శ్రీ వర్తింప చేస్తున్నారు. క్యాన్సర్‌కు కూడా ఆరోగ్య శ్రీలో ఉచితంగా చికిత్స అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆస్పత్రులకు పెండింగ్‌లో ఉంచిన బిల్లులను ఈ ప్రభుత్వం చెల్లించింది. ఏడాది కాలంలో 1,815 కోట్ల రూపాయల బకాయిని క్లియర్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మరో రూ. 315 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించింది.