మన దగ్గర డాక్టర్లు కరువు

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై… ఇలాంటి మెట్రో నగరాల్లో తిరుగుతుంటే.. ఐటీ భవనాలను తలదన్నే కార్పొరేట్ ఆసుపత్రులు కిలోమీటర్‌కు ఒకటి కనపడుతుంటాయి. హైదరాబాద్, చెన్నైలు వైద్య రంగానికే హబ్‌లు అని మనం జబ్బలు చరుచుకోని సంబురపడతాం. కానీ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ రూపొందించిన నివేదికలో ఆందోళన కలిగించే పలు అంశాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో నిర్వహించిన సర్వేను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించారు. మన దేశంలో ప్రతీ 10వేల మందికి […]

Advertisement
Update:2020-07-15 02:46 IST

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై… ఇలాంటి మెట్రో నగరాల్లో తిరుగుతుంటే.. ఐటీ భవనాలను తలదన్నే కార్పొరేట్ ఆసుపత్రులు కిలోమీటర్‌కు ఒకటి కనపడుతుంటాయి. హైదరాబాద్, చెన్నైలు వైద్య రంగానికే హబ్‌లు అని మనం జబ్బలు చరుచుకోని సంబురపడతాం. కానీ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ రూపొందించిన నివేదికలో ఆందోళన కలిగించే పలు అంశాలు ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో నిర్వహించిన సర్వేను విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించారు.

మన దేశంలో ప్రతీ 10వేల మందికి 8 మంది కంటే తక్కువే డాక్టర్లు ఉన్నారని నివేదిక తెలియజేసింది. ఇక్కడ వైద్యం సకాలంలో అందడం అనేది మిథ్యేనని తేల్చింది. మరోవైపు కరోనా లాక్‌డౌన్ అనంతరం మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగా కూడా బాగా దెబ్బతిన్నారు. ఇక ఈ రాష్ట్రాల్లో ప్రజలు బయట తిరగకుండా సైన్యాన్ని మోహరించాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు తీసుకోలేదని.. మౌళిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందని లాన్సెట్ తెలిపింది. అప్పటికే ఉన్న ఆరోగ్య వ్యవస్థను కూడా ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేక పోయిందని లాన్సెట్ విమర్శించింది. ఇండియాలో కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో లాన్సెట్ చెప్పింది. జూన్ 26 నుంచి జులై 3 వరకు వారంరోజుల్లోనే లక్ష కంటే ఎక్కువ కేసులు ఇండియాలో నమోదయ్యాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా చక్కని వ్యూహం రచించిందని పేర్కొంది. అక్కడ కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్యం కోసం వందలాది క్లినిక్‌లు ప్రారంభించింది. ఐసీయూ పడకల సంఖ్యను కూడా భారీగా పెంచింది. ఆరోగ్య సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చింది. ఇలా అనునిత్యం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసిందని ప్రశంసించింది.

Tags:    
Advertisement

Similar News