నిర్మలా సీతారామన్‌పై విమర్శలు చేసే హక్కు మీకెవరిచ్చారు? " చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వరంలో మళ్లీ మార్పు కనిపిస్తోంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇటీవల గట్టిగా ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు… బీజేపీ పెద్దల పక్షాన మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నరేంద్ర మోడీ… భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండానే వదిలేశాడని విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు… ఇప్పుడు వైసీపీ నేతలు బీజేపీ పెద్దలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు. అమరావతి 200వ రోజు ఉద్యమం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబునాయుడు… ప్రధాని పవిత్రమైన మట్టి-నీరు ఇచ్చారని ప్రశంసించారు. గతంలో మాత్రం మట్టి, నీరు […]

Advertisement
Update:2020-07-05 04:04 IST

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వరంలో మళ్లీ మార్పు కనిపిస్తోంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు ఇటీవల గట్టిగా ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు… బీజేపీ పెద్దల పక్షాన మాట్లాడుతున్నారు.

ఒకప్పుడు నరేంద్ర మోడీ… భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండానే వదిలేశాడని విమర్శలు చేసిన చంద్రబాబునాయుడు… ఇప్పుడు వైసీపీ నేతలు బీజేపీ పెద్దలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు.

అమరావతి 200వ రోజు ఉద్యమం సందర్భంగా మాట్లాడిన చంద్రబాబునాయుడు… ప్రధాని పవిత్రమైన మట్టి-నీరు ఇచ్చారని ప్రశంసించారు. గతంలో మాత్రం మట్టి, నీరు తమ ముఖాన కొట్టి వెళ్లారని ప్రధానిని చంద్రబాబు విమర్శించారు. తన ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు.

కేంద్రం తక్కువ ధరకే విద్యుత్‌ ఇస్తుంటే ఏపీ ఎక్కువ ధరకు అమ్ముకుంటోందంటూ రాంగ్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తిప్పికొట్టారు.

ఇందుకు స్పందించిన చంద్రబాబునాయుడు… నిర్మలా సీతారామన్‌ అన్న దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ఆమెపై విమర్శలు చేసే హక్కు వైసీపీకి ఎవరిచ్చారని నేను ప్రశ్నిస్తున్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నిర్మలా సీతారామన్‌పై వైసీపీ ఎదురుదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. కేంద్రంపైన కూడా దాడి చేస్తారా… ఇది చాలా దారుణం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇలా బీజేపీ నేతల కంటే ధీటుగా నిర్మలా సీతారామన్‌ పక్షాన వైసీపీపై విరుచుకుపడడం బట్టి… ఆయన బీజేపీనేతలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News