బీజేపీలోని టీడీపీ నేతలు ఇచ్చే సమాచారంతో జాగ్రత్త " సీతారామన్‌కు మిథున్ రెడ్డి లేఖ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు. ఇటీవల ఏపీ బీజేపీ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన నిర్మలా సీతారామన్… కేంద్రం యూనిట్ విద్యుత్‌ను రూ. 2.70కే ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు యూనిట్ 9 రూపాయలకు అమ్ముకుంటోందని ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం వివరించారు. తాజాగా ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌కు మిథున్ రెడ్డి లేఖ రాశారు. టీడీపీ […]
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి లేఖ రాశారు. ఇటీవల ఏపీ బీజేపీ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించిన నిర్మలా సీతారామన్… కేంద్రం యూనిట్ విద్యుత్‌ను రూ. 2.70కే ఇస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు యూనిట్ 9 రూపాయలకు అమ్ముకుంటోందని ఆమె ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తవమని ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం వివరించారు.
తాజాగా ఈ అంశంపై నిర్మలా సీతారామన్‌కు మిథున్ రెడ్డి లేఖ రాశారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలు కొందరు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వంపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని లేఖలో వివరించారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఆధారంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు ఇచ్చే సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.
గతంలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తులు టీడీపీ ఓడిపోగానే బీజేపీలో చేరారని మిథున్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఇచ్చేందుకు తాము అందుబాటులోనే ఉంటామని నిర్మలా సీతారామన్‌కు లేఖలో మిథున్ రెడ్డి వివరించారు.
గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసి వెళ్లిందన్నారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని ఆదుకునేందుకు విద్యుత్ సంస్థలకు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం17వేల904 కోట్లు అందజేసిందని లేఖలో వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు విద్యుత్ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ కో లాంటి సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు.