రవిప్రకాశ్‌కు ఉచ్చుబిగిస్తున్న ఈడీ

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. నిధుల మళ్లింపు వ్యవహారంలో కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్‌ యాక్ట్ కింద బుధవారం ఈడీ.. రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసింది. త్వరలోనే సమన్లు జారీ చేయనుంది. అక్రమంగా దారి మళ్లించి కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారన్న దానిపై ఈడీ విచారించనుంది. టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన 18 కోట్ల రూపాయలను నకిలీ పత్రాల సాయంతో డ్రా చేశారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్‌కు […]

Advertisement
Update:2020-07-02 05:49 IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు ఈడీ ఉచ్చు బిగిస్తోంది. నిధుల మళ్లింపు వ్యవహారంలో కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్‌ యాక్ట్ కింద బుధవారం ఈడీ.. రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేసింది. త్వరలోనే సమన్లు జారీ చేయనుంది. అక్రమంగా దారి మళ్లించి కోట్లాది రూపాయలను ఎక్కడికి తరలించారన్న దానిపై ఈడీ విచారించనుంది.

టీవీ9 సీఈవోగా ఉన్నప్పుడు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన 18 కోట్ల రూపాయలను నకిలీ పత్రాల సాయంతో డ్రా చేశారు. ఈ వ్యవహారంలో రవిప్రకాశ్‌కు మరో ఇద్దరు ఉద్యోగులు సహకరించారు. సెప్టెంబర్ 2018 నుంచి మే 2019 మధ్య ఈ 18 కోట్లను రవిప్రకాశ్ అక్రమంగా డ్రా చేశారు.

టీవీ9ను అలంద మీడియా కొనుగోలు చేసిన తర్వాత రికార్డులను పరిశీలించగా… 18 కోట్లు దారి మళ్లించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో సంస్థ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2019 అక్టోబర్‌లో రవిప్రకాశ్‌ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసులోనే ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగింది. 18 కోట్ల రూపాయలను ఎక్కడికి మళ్లించారన్న దానిపై దర్యాప్తు చేయబోతోంది.

Tags:    
Advertisement

Similar News