జగన్‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు

ఒకేరోజు 1088… 108, 104 వాహనాలను జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించడం అందరి దృష్టికి ఆకర్షించింది. జాతీయ మీడియా జగన్‌ చొరవను అభినందించింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సూచించారు. చిత్ర పరిశ్రమ నుంచి కూడా కొందరు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించారు. While the world is battling with corona crises , Hats off to @ysjagan garu to arrange a fleet of […]

Advertisement
Update:2020-07-01 13:03 IST

ఒకేరోజు 1088… 108, 104 వాహనాలను జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించడం అందరి దృష్టికి ఆకర్షించింది. జాతీయ మీడియా జగన్‌ చొరవను అభినందించింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సూచించారు. చిత్ర పరిశ్రమ నుంచి కూడా కొందరు జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించారు.

ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్‌ ట్వీట్ చేశారు. జగన్‌పై గౌరవం మరింత పెరిగిందన్నారు. ఈ స్థాయిలో 108, 104 వాహనాలను ప్రవేశపెట్టిన జగన్‌మోహన్ రెడ్డికి పూరి హ్యాట్సాప్‌ చెప్పారు.

అటు సంగీత దర్శకుడు తమన్‌ కూడా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని అభినందించారు. వెల్‌డన్… గాడ్‌ బ్లెస్‌ అంటూ తమన్ ట్వీట్ చేశారు.

వెయ్యికి పైగా అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

108, 104 సర్వీసుల నిర్వాహణలో యూకే నేషనల్‌ హెల్త్ సర్వీసులో భాగమైన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీస్‌ సంస్థ … అరబిందో ఫార్మాతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో యూకేకు చెందిన సౌత్ సెంట్రల్ అంబులెన్స్ సర్వీస్‌కు కూడా ఆండ్రూ ఫ్లెమింగ్ అభినందనలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News