ఏపీని ఫాలో అవండి " రాజ్‌దీప్ సర్దేశాయ్
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు జాతీయ స్థాయిని ఆకర్షిస్తున్నాయి. ఒకేరోజు 1,088 … 108, 104 వాహనాలను జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించడంపై అభినందనలు వస్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ జగన్‌మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా చేశారని కితాబిచ్చారు. మిగిలిన వారు కూడా ఏపీని ఫాలో అవ్వాలని రాజ్‌దీప్ ఆకాంక్షించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాలు ఒక అడుగు ముందే ఉన్నాయని రాజ్‌దీప్ అభిప్రాయపడ్డారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ముఖ్యమంత్రి […]
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు జాతీయ స్థాయిని ఆకర్షిస్తున్నాయి. ఒకేరోజు 1,088 … 108, 104 వాహనాలను జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించడంపై అభినందనలు వస్తున్నాయి.
సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ జగన్‌మోహన్ రెడ్డిని అభినందించారు. జగన్ అద్భుతంగా చేశారని కితాబిచ్చారు. మిగిలిన వారు కూడా ఏపీని ఫాలో అవ్వాలని రాజ్‌దీప్ ఆకాంక్షించారు. ఈమేరకు ట్వీట్ చేశారు.
ఇప్పటికే కరోనా కట్టడిలో దక్షిణాది రాష్ట్రాలు ఒక అడుగు ముందే ఉన్నాయని రాజ్‌దీప్ అభిప్రాయపడ్డారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి జెండా ఊపి కొత్తవాహనాలను ప్రారంభించారు. వందల అంబులెన్స్‌లు ర్యాలీగా ముందుకుసాగిన దృశ్యాలను చూసేందుకు విజయవాడ ప్రజలు ఆసక్తి కనబరిచారు.
సీఎం ప్రారంభించిన తర్వాత 108,104 వాహనాలు ఆయా జిల్లాలకు బయలుదేరి వెళ్లాయి. అరబిందో సంస్థ ఈ వాహనాల నిర్వాహణను పర్యవేక్షిస్తుంది. కొత్తగా ప్రవేశపెట్టిన అంబులెన్స్ లలో అత్యాధునిక ఏర్పాట్లు అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చింది.
Southern states seem to be a step ahead of the rest in corona control. AP launches 1088 ambulances with mobile clinics to be used to screen every household in the state, linked to local health centres, doctors.. well done @ysjagan .. hope to see others follow suit!?
— Rajdeep Sardesai (@sardesairajdeep) July 1, 2020