పతంజలి కరోనా మందుపై కేంద్రం అభ్యంతరం

కరోనాకు సరైన వ్యాక్సిన్, మందు కనుగొనేందుకు ప్రపంచంలోనే అనేక దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇండియాలో మాత్రం రోజుకో మందు బయటకు వస్తోంది. వాటి విశ్వసనీయత ఎంత అన్నది పక్కనపెడితే ఒక కంపెనీని చూసుకుని మరొక కంపెని కరోనాకు మందు కనిపెట్టామంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అత్యధిక ధరకు ఆ మందులను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనాకు మందు అంటూ వస్తున్న వార్తలపై వైద్యులు పెదవి విరుస్తున్నారు. తాజాగా బాబారాందేవ్‌ కూడా రంగంలోకి దిగారు. తన పతంజలి సంస్థ […]

Advertisement
Update:2020-06-23 15:12 IST

కరోనాకు సరైన వ్యాక్సిన్, మందు కనుగొనేందుకు ప్రపంచంలోనే అనేక దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఇండియాలో మాత్రం రోజుకో మందు బయటకు వస్తోంది. వాటి విశ్వసనీయత ఎంత అన్నది పక్కనపెడితే ఒక కంపెనీని చూసుకుని మరొక కంపెని కరోనాకు మందు కనిపెట్టామంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అత్యధిక ధరకు ఆ మందులను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనాకు మందు అంటూ వస్తున్న వార్తలపై వైద్యులు పెదవి విరుస్తున్నారు.

తాజాగా బాబారాందేవ్‌ కూడా రంగంలోకి దిగారు. తన పతంజలి సంస్థ కరోనాకు ఆయుర్వేద మెడిసిన్ కనిపెట్టినట్టు ప్రకటించారు. ఆ మందును కొరోనిల్ పేరుతో లాంచ్ కూడా చేశారు. హరిద్వార్‌లో ఈ మందును ఆవిష్కరించారు. తమ కొరోనిల్ వారంరోజుల్లోనే కరోనాను నయం చేస్తుందని ప్రకటించుకున్నారు.

ఒక్కో కరోనిల్ కిట్‌ ధరను 545 రూపాయలుగా నిర్ణయించామని… వారంలో మార్కెట్లోకి తెస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏ ప్రాతిపదికన మందును సిద్ధం చేశారో చెప్పాలని ఆదేశించింది. అంతవరకు ఈ మందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది.

మందు తయారీ ఎలా చేశారు?,మందుపై జరిపిన పరిశోధనలు ఏమిటి?, జరిపిన ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను అందజేయాలని ఆదేశించింది. ఈ మందును విడుదల చేయడానికి ఇచ్చిన లైసెన్స్‌లను సమర్పించాలని స్పష్టం చేసింది.

ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కొత్త మందులపై ఆరా తీస్తోంది.

Tags:    
Advertisement

Similar News