కరోనా రోగుల చికిత్స కోసం 19 అంతస్థుల భవనం ఇచ్చేసిన బిల్డర్

దేశంలో కరోనా కరాళ నృత్యం ఆగడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజు రోజుకూ కోవిడ్-19 రోగులు పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు కూడా సరిపోవడం లేదు. రాష్ట్ర రాజధాని ముంబైలో కూడా దాదాపు అదే పరిస్థితి. అక్కడ ఇటీవల కేవలం ఒక ఐసీయూ బెడ్, 11 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కూడా ఖాళీ లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఒక బిల్డర్ తాను కొత్తగా […]

Advertisement
Update:2020-06-22 02:20 IST

దేశంలో కరోనా కరాళ నృత్యం ఆగడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజు రోజుకూ కోవిడ్-19 రోగులు పెరిగిపోతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు కూడా సరిపోవడం లేదు. రాష్ట్ర రాజధాని ముంబైలో కూడా దాదాపు అదే పరిస్థితి. అక్కడ ఇటీవల కేవలం ఒక ఐసీయూ బెడ్, 11 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారవర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కూడా ఖాళీ లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన ఒక బిల్డర్ తాను కొత్తగా నిర్మించిన 19 అంతస్థుల అపార్ట్‌మెంట్‌ను బ్రిహన్ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి అప్పగించారు. ఈ భవనాన్ని కోవిడ్-19 చికిత్సా కేంద్రంగా మార్చాలని కోరాడు. ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని మరికొన్ని రోజుల్లో కొనుగోలుదారులకు అప్పగించాల్సి ఉంది.

ఈ భవనానికి సంబంధించిన స్వాధీన పత్రం కూడా బీఎంసీ సదరు బిల్డర్‌కు జారీ చేసింది. కాగా, శ్రీజీ శరణ్ డెవలపర్స్‌ యజమాని మేహుల్ సంఘ్వీ మాట్లాడుతూ.. ‘ఈ భవనంలో మొత్తం 130 ఫ్లాట్స్ ఉన్నాయి. కొనుగోలుదారులకు త్వరలోనే అప్పగించాల్సి ఉంది. అయితే అందరితో మాట్లాడి దీన్ని కొన్ని రోజుల పాటు కొవిడ్-19 రోగుల క్వారంటైన్ సెంటర్‌గా వాడుకోవడానికి అనుమతి కోరగా.. వాళ్లు అంగీకరించారు’ అని చెప్పాడు.

మేహుల్ సంఘ్వీ

ముంబై మలాడ్‌లోని ఎస్వీరోడ్‌లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌కు ఇప్పటికే 300 మంది రోగులను తరలించారు. ఒక్కో ఫ్లాట్‌లో నలుగురు రోగుల చొప్పున ఉంచారు. ఈ భవనాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చడానికి సంఘ్వీని ఒప్పించింది ఉత్తర ముంబై పార్లమెంట్ సభ్యుడు గోపాల్ శెట్టి. ముంబైలో పెరుగుతున్న కరోనా రోగులను ఉంచడానికి ఎక్కడ సరైన స్థలం దొరకట్లేదని.. పెద్దమనసుతో ఈ బిల్డింగ్ ఇవ్వమని కోరడంతో కొనుగోలుదారులతో మాట్లాడి ఒప్పించారు.

మేహుల్ సంఘ్వీ చేసిన ఈ పనికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. గృహ ప్రవేశం కాని ఫ్లాట్లను అప్పగించిన కొనుగోలుదారులపై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News