రాజ్యసభ‌ ఎన్నికల ఎఫెక్ట్.... తగ్గిన కాంగ్రెస్‌ బలం

పెద్దలసభ కమలానికి పరీక్షలు పెడుతోంది. రాజ్యసభలో ప్రతిపక్షం బలంగా ఉండడంతో అనేక బిల్లులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇక్కడ బలం పెంచుకునేందుకు గత రెండేళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మాత్రం పెరగలేదు. ఇటీవల 19 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌, వైసీపీ చెరో నాలుగు సీట్లలో విజయం సాధించాయి. మిగిలిన మూడు సీట్లను ఇతరులు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం […]

Advertisement
Update:2020-06-21 02:25 IST

పెద్దలసభ కమలానికి పరీక్షలు పెడుతోంది. రాజ్యసభలో ప్రతిపక్షం బలంగా ఉండడంతో అనేక బిల్లులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో ఇక్కడ బలం పెంచుకునేందుకు గత రెండేళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఇంకా పూర్తిస్థాయిలో మాత్రం పెరగలేదు.

ఇటీవల 19 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌, వైసీపీ చెరో నాలుగు సీట్లలో విజయం సాధించాయి. మిగిలిన మూడు సీట్లను ఇతరులు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 86. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 41కి పడిపోయింది.

245 సీట్ల రాజ్యసభలో ఎన్‌డీఏ బలం 100కి చేరువలో ఉంది. ఇతర అనుకూల పార్టీలు ఏఐడీఎంకే 9 సీట్లు, బీజేడీ9 సీట్లు, వైసీపీ 6 సీట్లతో పాటు ఇతర నామినేటేడ్‌ మెంబర్స్‌, చిన్నా చితకా పార్టీలు కలుపుకుంటే పెద్దలసభలో మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు.

మార్చిలో 61 రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ వచ్చింది. వీటిలో బీజేపీ 17, కాంగ్రెస్‌ 9, జేడీయూ 3, బీజేడీ, టీఎంసీ చెరో నాలుగు సీట్లు, ఎఐఎడీఎంకె, డీఎంకే చెరో మూడు సీట్లు, ఎన్సీసీ, ఆర్జేడీ, టీఆర్‌ఎస్‌ చెరో రెండు సీట్లు ఏకగ్రీవ ఎన్నిక ద్వారా గెలుచుకున్నాయి.

మొత్తం 61 సీట్లకు ఎన్నికైన సభ్యల్లో 43 మంది కొత్తవారు. మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాదిత్య సిందియా, కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖార్గే తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఓడిపోయారు.

Tags:    
Advertisement

Similar News