చైనాతో ఘర్షణ.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ అధికారి
భారత్-చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల ఘర్షణలో ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. అలాగే, మరి కొంత మంది సైనికులు గాయపడ్డారు. కాగా, చనిపోయిన ఆర్మీ అధికారి తెలంగాణకు చెందిన వ్యక్తని ప్రభుత్వం తెలిపింది. సూర్యపేటకు చెందిన బిక్కుమల్ల సంతోష్ బాబు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్తుతం కల్నన్ హోదాలో ఉన్నారు. గత […]
భారత్-చైనా సైనికుల మధ్య గాల్వన్ లోయ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల ఘర్షణలో ఒక ఆర్మీ అధికారి, ఇద్దరు జవాన్లు మరణించారు. అలాగే, మరి కొంత మంది సైనికులు గాయపడ్డారు. కాగా, చనిపోయిన ఆర్మీ అధికారి తెలంగాణకు చెందిన వ్యక్తని ప్రభుత్వం తెలిపింది.
సూర్యపేటకు చెందిన బిక్కుమల్ల సంతోష్ బాబు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్తుతం కల్నన్ హోదాలో ఉన్నారు. గత ఏడాదిన్నరగా ఆయన చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. సంతోష్ భార్య సంతోషి, ఒక కుమార్తె, మరొక కుమారుడు ఉన్నారు. సంతోష్ నాన్న స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు.
రెండు నెలల క్రితమే సంతోష్‌కు హైదరాబాద్ బదిలీ అయ్యింది. ఆయన వచ్చి విధుల్లో చేరాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా చైనా సరిహద్దులోనే ఉండిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఇరుదేశాల సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆయన చనిపోవడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది.
సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. లద్దాఖ్ లోని గాల్వన్ లోయలో చనిపోయిన ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.