ఆగేది లేదంటున్న నిమ్మగడ్డ

వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నా సరే తగ్గేది లేదంటున్నారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. తక్షణం ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించడం ఎలా అన్న దానిపై ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ పత్రిక ఒకటి వెల్లడించింది. ఎలాగో ప్రభుత్యానికి తనకు బాధ్యతలు అప్పగించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు కాబట్టి… నేరుగా గవర్నర్‌ ద్వారా పదవీబాధ్యతలు స్వీకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అసలు తనకు బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వంతో పనేంటి… తాను గవర్నర్‌కే జవాబుదారి […]

Advertisement
Update:2020-06-11 06:11 IST

వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నా సరే తగ్గేది లేదంటున్నారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. తక్షణం ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించడం ఎలా అన్న దానిపై ఆయన న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ విషయాన్ని టీడీపీ పత్రిక ఒకటి వెల్లడించింది.

ఎలాగో ప్రభుత్యానికి తనకు బాధ్యతలు అప్పగించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు కాబట్టి… నేరుగా గవర్నర్‌ ద్వారా పదవీబాధ్యతలు స్వీకరించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అసలు తనకు బాధ్యతలు అప్పగించే విషయంలో ప్రభుత్వంతో పనేంటి… తాను గవర్నర్‌కే జవాబుదారి అని నిమ్మగడ్డ వాదిస్తున్నారట.

తనకు తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినందున… ఇక్కడ ప్రభుత్వం అంటే సాంకేతికంగా గవర్నరే అవుతారు కాబట్టి… గవర్నర్‌ను సంప్రదించి విధుల్లో చేరిపోవాలని నిమ్మగడ్డ నిర్ణయించుకున్నట్టు సమాచారం ఉందని టీడీపీ పత్రిక వెల్లడించింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే లోగా ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించాలన్న ఉత్సాహంతో నిమ్మగడ్డ ఉన్నారు.

హైకోర్టు న్యాయవాది జనార్దన్‌ రెడ్డి మాత్రం గవర్నర్‌ ద్వారా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదంటున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వానికి రెండునెలల గడువు ఉందని… అదే సమయంలో ఈ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినందున… ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే అవకాశం కూడా నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు లేదని హైకోర్టు న్యాయవాది జనార్దన్‌ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News