నిమ్మగడ్డపై వరుస పిటిషన్లు

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించకుండా నిమ్మగడ్డను అడ్డుకోవాలంటూ రిటైర్డ్ ఐజీ డాక్టర్ సుందర్‌ కుమార్ దాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్‌ఈసీని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర కేబినెట్‌కు లేదని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నిమ్మగడ్డకు కూడా వర్తిస్తుందని… కాబట్టి ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. 2016లో నిమ్మగడ్డ కూడా నాటి సీఎం చంద్రబాబు సిఫార్సు లేఖ ఆధారంగానే నియమితులయ్యారని.. కాబట్టి […]

Advertisement
Update:2020-06-10 02:55 IST

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించకుండా నిమ్మగడ్డను అడ్డుకోవాలంటూ రిటైర్డ్ ఐజీ డాక్టర్ సుందర్‌ కుమార్ దాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఎస్‌ఈసీని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర కేబినెట్‌కు లేదని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నిమ్మగడ్డకు కూడా వర్తిస్తుందని… కాబట్టి ఆయన ఎస్‌ఈసీగా బాధ్యతలు నిర్వహించకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు.

2016లో నిమ్మగడ్డ కూడా నాటి సీఎం చంద్రబాబు సిఫార్సు లేఖ ఆధారంగానే నియమితులయ్యారని.. కాబట్టి ఆయన నియామకానికి సంబంధించిన జీవో 11ను కొట్టివేయాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

2016లో అప్పటి మంత్రి మండలి సిఫారసు మేరకు నియమితులైన నిమ్మగడ్డ.. ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఏ అధికారంతో పదవిలో కొనసాగాలనుకుంటున్నారో సంజాయిషీ అడగాలని పిటిషనర్ కోర్టును కోరారు.

ఎస్‌ఈసీగా ముఖ్య కార్యదర్శి స్థాయికి తక్కువ కాని అధికారిని ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్‌ నియమించాలంటున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌–200 (2)ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దీనిని రద్దుచేయాలని అభ్యర్థించారు.

ఇటీవల హైకోర్టు కూడా నిమ్మగడ్డ కేసును విచారించిన సమయంలో ఎస్‌ఈసీని నియమించడం పూర్తిగా గవర్నర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని… రాష్ట్ర కేబినెట్‌కు సిఫార్సు చేసే అధికారం లేదని తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు ఆధారంగా కనగరాజు ఎస్‌ఈసీగా కొనసాగలేకపోయారు. ఇప్పుడు ఇదే తీర్పు నిమ్మగడ్డకు కూడా వర్తింప చేస్తే ఆయన కూడా ఎస్‌ఈసీగా ఉండేందుకు అవకాశం లేదు.

Tags:    
Advertisement

Similar News