ప్రమోట్‌ చేస్తారా? పరీక్ష పెడతారా?... కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం...

టెన్త్‌ ఎగ్జామ్స్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. హైకోర్టు తీర్పులతో గందరగోళం నెలకొంది. దీంతో పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ వదిలిపెట్టి మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తే చాలా టెక్నికల్‌ ఇష్యూస్ […]

Advertisement
Update:2020-06-07 16:44 IST

టెన్త్‌ ఎగ్జామ్స్‌ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. హైకోర్టు తీర్పులతో గందరగోళం నెలకొంది. దీంతో పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశం కావడంతో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ వదిలిపెట్టి మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహిస్తే చాలా టెక్నికల్‌ ఇష్యూస్ వస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా పరీక్షలను రద్దు చేసింది.

అయితే ఇప్పుడు ఎగ్జామ్స్‌ నిర్వహించే పరిస్థితి లేదు. ఇప్పటికే 20 మార్కులకు ఇంటర్నల్‌ పరీక్షలు నిర్వహించారు. ఇక మిగిలింది 80 మార్కులు. వీటికి ఇప్పటికే ఏడాది పొడవునా పరీక్షలు నిర్వహించారు. దీంతో వాటిలో వెయిటేజీ గ్రేడ్‌లు వేయాలనేది ఓ ప్రతిపాదన. ఇదే మంచిది అని అధికారులు కూడా అనుకుంటున్నారు.

మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలపై రేపు ఏదో ఒకటి తేల్చే అవకాశం కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News