నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు... కోర్టుల్లో అన్యాయంపై గొంతెత్తుతా- లక్ష్మీపార్వతి

ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆవేదన చెందారు. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని విమర్శించారు. 1993 వరకు న్యాయవ్యవస్థపై ఒక గౌరవం ఉండేదన్నారు. ఆ తర్వాత వ్యవస్థలు ప్రభావం అవుతూ వస్తున్నాయన్నారు. ములాయం సింగ్ యాదవ్ కోడలిపై అవినీతి ఆరోపణలు వస్తే ఆమె రాజ్యాంగ పదవిలో లేరని ఆమె విషయంలో తీర్పులు చెప్పిన కోర్టులు… అదే జగన్‌మోహన్ రెడ్డి ఏ పదవిలో లేకపోయినప్పటికీ ఒక వ్యక్తి లేఖ రాయగానే సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. […]

Advertisement
Update:2020-06-01 09:25 IST
నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు... కోర్టుల్లో అన్యాయంపై గొంతెత్తుతా- లక్ష్మీపార్వతి
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆవేదన చెందారు. వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని విమర్శించారు. 1993 వరకు న్యాయవ్యవస్థపై ఒక గౌరవం ఉండేదన్నారు. ఆ తర్వాత వ్యవస్థలు ప్రభావం అవుతూ వస్తున్నాయన్నారు. ములాయం సింగ్ యాదవ్ కోడలిపై అవినీతి ఆరోపణలు వస్తే ఆమె రాజ్యాంగ పదవిలో లేరని ఆమె విషయంలో తీర్పులు చెప్పిన కోర్టులు… అదే జగన్‌మోహన్ రెడ్డి ఏ పదవిలో లేకపోయినప్పటికీ ఒక వ్యక్తి లేఖ రాయగానే సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు.

చంద్రబాబుపై వైఎస్‌ విజయమ్మ పిటిషన్ వేస్తే మాత్రం సిబ్బంది లేరంటూ నాటి సీబీఐ జేడీ ఆలస్యం చేశారన్నారు. అంతలోనే చట్టంలోని లోపాలను వాడుకుని… నాట్ బిఫోర్ నాటకాలు ఆడి చివరకు జస్టిస్ రోహిణి ముందుకు కేసు వచ్చేలా చేసి పిటిషన్‌ను కొట్టి వేశారన్నారు. ఇంత పెద్ద నేరానికి సంబంధించిన వ్యవహారంపై కోర్టులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు.

ఒక తాగుడుబోతు నడిరోడ్డుపై విచ్చలవిడిగా తాగి ప్రధానిని, ముఖ్యమంత్రిని తిడుతూ, రెండు మతాలను తిడుతూ బట్టలూడదీసుకుని రోడ్డుపై తిరుగుతుంటే దాన్ని సుమోటోగా తీసుకోవాల్సింది పోయి… పిచ్చోడిని లోపలేయండి అని చెప్పాల్సిందిపోయి టీడీపీ కట్ చేసిన వీడియోలతో కేసు వేస్తే దాన్ని సీబీఐకి అప్పగించడంతో కోర్టు నవ్వులపాలైందన్నారు.

ఈ వ్యాఖ్యలపై తనకూ కోర్టు నోటీసులు ఇచ్చినా పర్వాలేదన్నారు లక్ష్మీపార్వతి. గొంతెత్తి ప్రశ్నించినందుకు తనను అరెస్ట్ చేసినా పర్వాలేదన్నారు. ఎవరో ఒకరు గొంతెత్తి ధైర్యంగా అడ్డుకోకపోతే… అన్యాయం జరుగుతుందన్నారు. ఇంత దారుణంగా ఉన్నప్పుడు విమర్శలు చేయకపోతే వ్యవస్థే ప్రమాదంలో పడుతున్నాదన్నారు. లక్షలాది మందిని అరెస్ట్ చేస్తే చేయనీయండి అని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.

పేదలకు ఇంగ్లీష్ విద్య అందిస్తామంటే అడ్డుకున్నారు… రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే దాన్ని అడ్డుకున్నారన్నారు. వ్యవస్థలను సర్వశాసనం చేసింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబులాంటి ఓడిపోయిన వారే కోర్టులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాల్లోకి కోర్టులు అతిగా జోక్యం చేసుకుంటున్నాయన్నారు. గత ప్రభుత్వం అసాధారణ స్థాయిలో తప్పులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

Advertisement

Similar News