కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. 3లక్షలకు పైగా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకూ 3 లక్షల 4వేల 326 పరీక్షలు నిర్వహించారు. పది లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీలో గత 24 గంటల్లో 9,136 సాంపిల్స్ ని పరీక్షించారు. వీరిలో 47 మంది కరోనా పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. మరో 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రం లో నమోదైన మొత్తం 2,627 పాజిటివ్ […]

Advertisement
Update:2020-05-25 00:54 IST

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. 3లక్షలకు పైగా పరీక్షలు రాష్ట్రంలో నిర్వహించారు. మొత్తం ఇప్పటివరకూ 3 లక్షల 4వేల 326 పరీక్షలు నిర్వహించారు. పది లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఏపీ నిలిచింది.

ఏపీలో గత 24 గంటల్లో 9,136 సాంపిల్స్ ని పరీక్షించారు. వీరిలో 47 మంది కరోనా పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. మరో 47 మంది డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రం లో నమోదైన మొత్తం 2,627 పాజిటివ్ కేసు లకు గాను 1,807 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764.

ఏపీలో ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి 61,781 మంది వచ్చారు .వీరి క్వారంటైన్‌ ముగిసింది. దీంతో వీరిని ఇంటికి పంపారు. వలస కార్మికులు 57,735.. టూరిస్ట్ లు 770, స్టూడెంట్స్‌ 137, ఇతరులు 3,139 మంది ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News