ఓటీటీకి లైన్ క్లియర్ అవుతోంది
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కీలక నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చేనెల నుంచి కార్యకలాపాలు మొదలుకాబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు అనుమతినిచ్చారు. రెండో దశలో షూటింగ్స్ కు అనుమతినిచ్చారు. మూడో దశలో థియేటర్లు తెరుస్తారు. మరోవైపు ఓటీటీపై కూడా నిర్మాతల మండలి ఈ వారంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనాతో థియేటర్లు, రిలీజ్ ల పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు ఇప్పట్లో థియేటర్లు దొరికేలా లేవు. ఒకవేళ దొరికినా 50శాతం […]
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కీలక నిర్ణయాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చేనెల నుంచి కార్యకలాపాలు మొదలుకాబోతున్నాయి. ఇందులో భాగంగా మొదటి దశలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు అనుమతినిచ్చారు. రెండో దశలో షూటింగ్స్ కు అనుమతినిచ్చారు. మూడో దశలో థియేటర్లు తెరుస్తారు. మరోవైపు ఓటీటీపై కూడా నిర్మాతల మండలి ఈ వారంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనాతో థియేటర్లు, రిలీజ్ ల పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు ఇప్పట్లో థియేటర్లు దొరికేలా లేవు. ఒకవేళ దొరికినా 50శాతం ఆక్యుపెన్సీతో, చిన్న సినిమాల్ని నడిపించడం తలకుమించిన భారం. అందుకే చిన్న సినిమా నిర్మాతలంతా తమ సినిమాల్ని గంపగుత్తగా ఓటీటీలకు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే అలా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి.
అందుకే చిన్న సినిమాల నిర్మాతలంతా ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వారం రోజుల్లో దీనిపై చిన్న నిర్మాతలకు అనుకూలంగా నిర్ణయం వచ్చే ఛాన్స్ ఉంది. థియేట్రికల్ తో సంబంధం లేకుండా తమ సినిమాల్ని ఓటీటీలకు ఇచ్చుకోవచ్చు. ఇప్పటికే ఈ దిశగా కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చాలానే అమ్ముడుపోయాయి. వచ్చే నెల నుంచి టాలీవుడ్ సినిమాలు కూడా భారీ ఎత్తున ఓటీటీలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.