విషాదం : లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాడు... తుఫానుతో ఇల్లు కోల్పోయాడు

ఇతని విషాదాన్ని తెలియజేయడానికి ఏం పదాలు వాడాలో అర్థం కావడం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిందనే ప్రాసలో రాయలేము. ఎందుకంటే అతని జీవితంలో వరుసగా జరుగుతున్న విషాదాలు చూస్తే మనసు చలించక మానదు. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన జమాల్ మోండాల్ (45) ఉపాధి నిమిత్తం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లాడు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయాడు. ఆదాయ మార్గాలు లేక పస్తులున్నాడు. ఇక బెంగుళూరులో తాను […]

Advertisement
Update:2020-05-24 00:43 IST

ఇతని విషాదాన్ని తెలియజేయడానికి ఏం పదాలు వాడాలో అర్థం కావడం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిందనే ప్రాసలో రాయలేము. ఎందుకంటే అతని జీవితంలో వరుసగా జరుగుతున్న విషాదాలు చూస్తే మనసు చలించక మానదు.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన జమాల్ మోండాల్ (45) ఉపాధి నిమిత్తం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లాడు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో ఉపాధి కోల్పోయాడు. ఆదాయ మార్గాలు లేక పస్తులున్నాడు. ఇక బెంగుళూరులో తాను జీవనం సాగించలేనని తెలుసుకొని1800 కిలోమీటర్ల దూరంలోని సొంతూరికి వెళ్లాడు. కనీసం కుటుంబంతో ఉన్నా ఉపశమనం లభిస్తుందని ఆశించాడు.

కానీ, మోండాల్ ఆశ అడియాశలే అయ్యాయి. ఒకవైపు లాక్‌డౌన్ దెబ్బకు సొంతూరికి వచ్చిన అతడిని ఎంఫాన్ తుఫాను రూపంలో దురదృష్టం వెంటాడింది. సోమవారం ఉదయం బెంగళూరు నుంచి వచ్చి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. తన వాళ్లను కలుసుకున్నందుకు ఎంతో సంతోషించాడు. కానీ ఎంఫాన్ తుఫాను అతని ఇంటిని కూల్చేసింది.

దీంతో నిలువ నీడ లేక భార్య, నలుగురు కూతుర్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరానికి వెళ్లాడు. ఉన్న ఒక్కగానొక్క గుడిసె కూడా పూర్తిగా నేలమట్టమై నిలువ నీడలేకుండా పోవడం ఒక్క మోండాల్ జీవితంలోనే కాదు… ఇలాంటి బాధితులు పశ్చిమ బెంగాల్‌లో ఎంతో మంది ఉన్నారు.

బెంగళూరు నుంచే వచ్చిన కుత్బుద్దీన్‌ది మరో గాధ. బెంగుళూరు నుండి అష్టకష్టాలు పడి ప్రయాణించి గ్రామానికి చేరుకున్న కుత్బుద్దీన్ కు కూలి పోయిన ఇల్లు స్వాగతం పలికింది. పశ్చిమ బెంగాల్ లో తుఫాన్ సృష్టించిన భీభత్సం అనేక జీవితాలను అతలాకుతలం చేసింది. ఒకవైపు కరోనా గత్తరతో…లాక్ డౌన్ కష్టాలతో పోరాడుతున్న ప్రజలకు ఎంఫాన్ తుఫాను తీరని దుక్కాన్నే మిగిల్చింది. కుత్బుద్దీన్ గ్రామం కూడా తుఫాన్ దాటికి వణికి పోయింది. ఇళ్ళు కూలిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.

కుత్బుద్దీన్ ఇల్లు సగం కూలి పోయింది. పైకప్పు ఎగిరిపోయింది. వణుకుతూ భార్యాపిల్లలు అక్కడే గడుపుతున్నారు. వర్షం వస్తే ఎక్కడ ఉండాలో కూడా తెలయదు. నాలుగు రోజుల ప్రయాణ కష్టం మర్చి పోయాడు కుత్బుద్దీన్. ఇప్పుడు అంతకన్నా పెద్దకష్టం వచ్చి పడింది.

ʹʹమాకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందలేదు. ఏ అధికారి ఇక్కడకు రాలేదు. నా ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి దెబ్బతిన్న ఇంట్లోనే మేము ఇంకా నిద్రపోతున్నాముʹʹ అని అతను చెప్పాడు. కొంతమంది పొరుగువారు కుత్బుద్దీన్ కుటుంభానికి సహాయం చేస్తున్నారు కాని బెంగళూరులో ప్రారంభమైన కుత్బుద్దీన్ కష్టాలు ఇంటికి చేరుకున్నా వెంటాడుతూనే ఉన్నాయి. ” నేను పశ్చిమ బెంగాల్‌లోని నా ఇంటికి వస్తే ఆకలితో ఉండను అని అనుకున్నాను కానీ ఇప్పుడు నా తలపై కప్పు కూడా లేదు” అని అన్నాడు కుత్బుద్దీన్.

Tags:    
Advertisement

Similar News