ముగిసిన సినీపరిశ్రమ పెద్దల మీటింగ్

లాక్ డౌన్ వల్ల సినీపరిశ్రమ మూతపడిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభించాలి, థియేటర్లు తెరవాలి అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సినీపెద్దలంతా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో సమావేశమయ్యారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు […]

Advertisement
Update:2020-05-21 12:24 IST

లాక్ డౌన్ వల్ల సినీపరిశ్రమ మూతపడిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు షూటింగ్స్ ప్రారంభించాలి, థియేటర్లు తెరవాలి అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో సినీపెద్దలంతా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో సమావేశమయ్యారు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.

సినీ పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు మంత్రి. సినిమా, టీవీ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు.. ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ఉందని, అయినప్పటికీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసిన తలసాని… షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సమావేశంలో సినీపెద్దలు చెప్పిన అంశాలన్నింటినీ నోట్ చేసుకున్న మంత్రి.. ప్రభుత్వం కూడా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రితో తలసాని ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు ఈ అంశంపై ఓ స్పష్టత రానుంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చే నెల మొదటి లేదా రెండో వారం నుంచి షూటింగ్స్ కు అనుమతి వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News