పండ్లు, బిస్కెట్లు, ఫుడ్, పారాగాన్ చెప్పులు... వలస కార్మికుల పట్ల ఏపీ ఆదర్శం

దేశ నిర్మాణంలో అసలైన నిర్మాతలు వలస కూలీలు. కానీ లాక్‌డౌన్ వారిని రోడ్డున పడేసింది. పనిచేయించుకున్న యాజమాన్యాలు పని లేదని ముఖం చాటేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులు మా రాష్ట్రం ఓటర్లు కాదు అనుకున్నాయో ఏమో సాయం చేసేందుకు మనసు రాలేదు. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలపై మౌనం దాల్చి చాలా రోజులైంది. 20 లక్షల కోట్లు అంటూ రోజూ ప్రెస్‌మీట్ పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి… వలస కూలీలను గౌరవంగా వారి ఇళ్లకు మాత్రం చేర్చేందుకు […]

Advertisement
Update:2020-05-18 03:38 IST

దేశ నిర్మాణంలో అసలైన నిర్మాతలు వలస కూలీలు. కానీ లాక్‌డౌన్ వారిని రోడ్డున పడేసింది. పనిచేయించుకున్న యాజమాన్యాలు పని లేదని ముఖం చాటేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులు మా రాష్ట్రం ఓటర్లు కాదు అనుకున్నాయో ఏమో సాయం చేసేందుకు మనసు రాలేదు. కేంద్ర ప్రభుత్వం వలస కూలీలపై మౌనం దాల్చి చాలా రోజులైంది. 20 లక్షల కోట్లు అంటూ రోజూ ప్రెస్‌మీట్ పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి… వలస కూలీలను గౌరవంగా వారి ఇళ్లకు మాత్రం చేర్చేందుకు మాత్రం నోట మాట రాలేదు.

ఆడవాళ్లు, చిన్నచిన్న పిల్లలు వందల కిలోమీటర్లు ఈ దేశంలో హైవేలను పట్టుకుని సుదూర గమ్యం వైపు సాగుతున్నారు. అన్ని ప్రభుత్వాలు ఈ తంతును చూస్తూ కళ్లుమూసుకున్నా… ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి నడిచి వెళ్తున్న వారి బాధలను తన పరిధిలో తీర్చేందుకు సిద్ధమైంది. ఏపీకి చెందిన వలస కార్మికులు కాకపోయినా వారి కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఆహార శిబిరాన్ని తెరించింది. అక్కడే భోజనం, నీరు, ఇతర సదుపాయలు అందిస్తోంది. అక్కడితో ఆగకుండా నడిచి వెళ్లాల్సిన అవసరం లేకుంటా ఆర్టీసీ బస్సులను వలస కార్మికుల కోసం ఉచితంగా నడుపుతోంది. రాష్ట్ర సరిహద్దు వరకు బస్సుల్లో కార్మికులను చేరుస్తోంది ఏపీ ప్రభుత్వం.

ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసులు చురుగ్గా చొరవ చూపుతున్నారు. పలు చోట్ల ఆహార శిబిరాల్లో పోలీసు శాఖ వలస కార్మికుల కోసం చెప్పులు కూడా అందజేస్తోంది. విజయవాడలో సీపీ ద్వారాక తిరుమలరావు నేతృత్వంలో పోలీసులు ఆహార శిబిరంలో వలస కార్మికులకు పండ్లు, పిల్లలకు బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లు, భోజనం అందజేస్తున్నారు. చెప్పులు కూడా లేకుండా నడిచివెళ్తున్న కార్మికులకు చొప్పులను పంపిణీ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా వలస కార్మికుల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా వలస కార్మికులు నడిచి వెళ్తుంటే వారిని శిబిరాల వద్దకు వెళ్లేలా సూచించాలని… అక్కడికి వస్తే ఆహారం అందజేయడంతో పాటు ఉచితంగా రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సుల్లో తీసుకెళ్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

వలస కార్మికుల విషయంలో ప్రతి ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సూచించారు. వలస కార్మికులు ఏపీకి చెందిన వారు కాకపోయినా మానవత్వంతో మన రాష్ట్ర పరిధి వరకు వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఆదేశించారు. ఖర్చు విషయంలో వెనుకాడవద్దని సూచించారు. శిబిరాల్లో భోజనం అందించడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సుల్లో తీసుకెళ్లాలని ఆదేశించారు.

ఈ అంశంపై సమీక్షలో అధికారులు… వలస కార్మికుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరే రాష్ట్రం తీసుకోవడం లేదని సీఎంకు వివరించారు.

??? ??????? ???????? ???, ???????????? ?? ??????, ??????????, ??? ?. ???????????, ????.??, ??? ?????????????, ???…

Publiée par Andhra Pradesh Police sur Dimanche 17 mai 2020

Tags:    
Advertisement

Similar News