కేంద్రం ప్యాకేజీలో పాత చింతకాయ పచ్చడే... పబ్లిసిటీ జిమ్మిక్కులే ఎక్కువ !

20 లక్షల కోట్ల ప్యాకేజీ. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లోకి తెచ్చేందుకు సరైన మందు ఇదే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. జాతినుద్దేశించి చేసిన 33 నిమిషాల ప్రసంగంలో ఊదరగొట్టేశారు. ఆర్ధికమంత్రి వివరాలు అందిస్తారని చెప్పారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటే ఏంతో కొంత ఊరట ఉంటుందని అందరూ ఆశించారు. కనీసం పేదవారికి ఏదైనా సాయం చేస్తారని…లేకపోతే ఆర్ధికంగా ఊరట ఇచ్చే అంశాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ తీరా ఇప్పుడు […]

Advertisement
Update:2020-05-17 02:14 IST

20 లక్షల కోట్ల ప్యాకేజీ. కరోనా సమయంలో దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థను ట్రాక్‌లోకి తెచ్చేందుకు సరైన మందు ఇదే అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. జాతినుద్దేశించి చేసిన 33 నిమిషాల ప్రసంగంలో ఊదరగొట్టేశారు. ఆర్ధికమంత్రి వివరాలు అందిస్తారని చెప్పారు.

20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటే ఏంతో కొంత ఊరట ఉంటుందని అందరూ ఆశించారు. కనీసం పేదవారికి ఏదైనా సాయం చేస్తారని…లేకపోతే ఆర్ధికంగా ఊరట ఇచ్చే అంశాలు ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ తీరా ఇప్పుడు నాలుగు రోజులుగా ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనలు అందరికీ నిరాశ కలిగించినవే.

లాక్‌డౌన్‌లో కేంద్రం ఏం సాయం చేయలేదు. కనీసం రాష్ట్రాలను ఆదుకోనే చర్యలు చేపట్టలేదు. కొందరు ముఖ్యమంత్రులు కాన్ఫరెన్స్‌లో ప్రధాని దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఆయన చెప్పారు.

నాలుగు రోజులు ప్రకటనలు చూస్తే కేవలం పబ్లిసిటీ జిమ్మిక్కే కనిపిస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం తక్కువ… ప్రచారం ఎక్కువ అనే కామెంట్లు పేలుతున్నాయి.

కేంద్రం ప్యాకేజీలతో ప్రజలకు ఒరిగేదేమి లేదని పెదవి విరుపులు మొదలయ్యాయి. రోజుకో ప్రకటనతో మభ్యపెట్టే చర్యలు తప్ప…ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు ఏం లేవని అంటున్నారు.

బొగ్గు బ్లాక్ లను ప్రైవేటీకరణ పాత విషయం. రోదసీ రంగం ఆలెడ్రీ ప్రైవేటు పరం చేశారు. గత పదేళ్లుగా చెబుతున్న విషయాలను ప్యాకేజీల్లో చెబుతున్నారని విమర్శలు మొదలయ్యాయి. విద్యుత్‌తో పాటు అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ కొనసాగుతుందని…ఇవాళ కొత్తగా చేస్తున్నదేమి లేదని పెదవి విరిస్తున్నారు.

వలస కూలీలు, రైతులకు డైరెక్టుగా మేలు జరిగే పథకాల ప్రస్తావన లేదు. సామాన్యుడికి అదనంగా ఇచ్చిన ఒక్క పైసా కూడా లేదు. కార్పొరేట్లకు పంచి పెట్టేందుకు కరోనా పేరుతో ప్యాకేజీ ప్రకటించారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సో కేంద్రం ప్యాకేజీతో రాష్ట్రాలకు ఒరిగేదేమి లేదు. సామాన్యుడికి కొత్తగా వచ్చే నయా పైసా లేదు.

Tags:    
Advertisement

Similar News