కరోనా ల్యాబ్‌లోనే తయారైంది " నితిన్‌ గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సహజంగా రాలేదని… ల్యాబ్‌లోనే తయారైందని సంచలన కామెంట్స్‌ చేశారు. ల్యాబొరేటరీ నుంచి రావడంతోనే దీన్ని గుర్తించేందుకు సరైన మెథడాలజీ లేకపోయిందని ఆయన అన్నారు. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని గడ్కరీ సూచించారు. కేంద్రం కొత్త ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీటీవీతో గడ్కరీ లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సహజంగా పుట్టలేదని… ఇది కృతిమమైందని అన్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను […]

Advertisement
Update:2020-05-14 01:50 IST

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సహజంగా రాలేదని… ల్యాబ్‌లోనే తయారైందని సంచలన కామెంట్స్‌ చేశారు. ల్యాబొరేటరీ నుంచి రావడంతోనే దీన్ని గుర్తించేందుకు సరైన మెథడాలజీ లేకపోయిందని ఆయన అన్నారు.

కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని గడ్కరీ సూచించారు. కేంద్రం కొత్త ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీటీవీతో గడ్కరీ లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా సహజంగా పుట్టలేదని… ఇది కృతిమమైందని అన్నారు. ఈ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో చాలా దేశాలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే వ్యాక్సిన్‌ వస్తుందని..అప్పుడు ఎలాంటి సమస్య ఉండబోదని చెప్పారాయన.

ఈ వైరస్‌ను ఏ పద్ధతిలో గుర్తించాలనేది పెద్ద సమస్యగా మారిందని గడ్కరీ అన్నారు. మంచి పరీక్ష పద్ధతి ఉంటే తొందరగా గుర్తిస్తే… తొందరగా ట్రీట్‌మెంట్‌ ఇవ్వొచ్చని చెప్పారు. ల్యాబ్‌లో నుంచి పుట్టుకు వచ్చిన వైరస్‌ కావడంతోనే దీన్ని ఎదుర్కొనేందుకు సమయం పట్టిందని…త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని చెప్పారు

మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నెలల వారీగా లాక్‌డౌన్‌ను కొనసాగించలేమని చెప్పిన గడ్కరీ….వ్యాపార కార్యకలపాలు తిరిగి ప్రారంభమైతే వలస కార్మికులు తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనాతో పాటు ఆర్ధిక యుద్ధంతో కూడా దేశం పోరాడాల్సి వస్తోందని…ఈ విషయం కూడా గుర్తించాలని అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే కరోనాపై కీలక కామెంట్స్‌ చేశారు. వుహాన్‌ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ తయారైందని…. ఇది చైనా తయారు చేసిన వైరస్‌ అంటూ కొన్నాళ్లు చైనా వైరస్‌… మరికొన్నాళ్లు వుహాన్‌ వైరస్‌ అంటూ ట్రంప్‌ కామెంట్స్‌ చేశారు. మనదేశంలో తొలిసారిగా గడ్కరీ ఈ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News