టెన్త్‌ ఎగ్జామ్స్‌ తేదీలపై తప్పుడు ప్రచారం... సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు

ఏపీలో పదోతరగతి పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అయితే డేట్‌లు మాత్రం ప్రకటించలేదు. అయితే సోషల్‌మీడియంలో మాత్రం పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారని… ఓ టైమ్‌ టేబుల్‌ వైరల్‌ అవుతోంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ప్రచారం చేస్తున్నారు. ఈనెల 18 నుంచి పరీక్షలు మొదలు కాబోతున్నాయని…. ఈ టైమ్‌ టేబుల్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ చినవీరబద్రుడు సంతకం ఈ లేఖపై […]

Advertisement
Update:2020-05-10 01:27 IST

ఏపీలో పదోతరగతి పరీక్షలు త్వరలో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తేదీలు త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. అయితే డేట్‌లు మాత్రం ప్రకటించలేదు.

అయితే సోషల్‌మీడియంలో మాత్రం పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారని… ఓ టైమ్‌ టేబుల్‌ వైరల్‌ అవుతోంది. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ప్రచారం చేస్తున్నారు. ఈనెల 18 నుంచి పరీక్షలు మొదలు కాబోతున్నాయని…. ఈ టైమ్‌ టేబుల్‌ సోషల్‌ మీడియాలో పెట్టారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ చినవీరబద్రుడు సంతకం ఈ లేఖపై ఉంది.

సోషల్ మీడియాలో ఈ టైమ్‌ టేబుల్‌ వైరల్‌ కావడంతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన్న వీరబద్రుడు స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారం లో ఉన్న 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ అసత్యమని ఓ ప్రకటన విడుదల చేశారు. కొంతమంది ఫేక్ షెడ్యూల్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ షెడ్యూల్‌ను నమ్మొద్దని కోరారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

తాజాగా తన సంతకంతో ఫేక్ షెడ్యూల్ వైరల్ చేయడం సైబర్‌ క్రైమ్‌ కిందకు వస్తుందని…. ఫేక్‌ టైమ్‌ టేబుల్‌ వైరల్‌ చేసిన వారిని గుర్తించి క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సింది గా పోలీసులను కోరినట్లు చెప్పారు. పరీక్షలు వాయిదా పడడంతో ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని… ఇలాంటివి ప్రచారం చేసి వారిని మరింత మానసిక వత్తిడికి లోనూ చేయొద్దని కోరారు.

Tags:    
Advertisement

Similar News