విశాఖలో టోటల్‌ కంట్రోల్‌....

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అదుపులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారంగా ప్రకటించనున్నారు. గుజరాత్‌ నుంచి వచ్చిన బృందం గ్యాస్‌ లీకేజ్‌ను ఆపేందుకు ఎంతో శ్రమించింది. ఎట్టకేలకు గ్యాస్ లీక్ ఆగింది. దీంతో కంపెనీలో ఇంకా ఎక్కడి నుంచి అయినా గ్యాస్‌ లీక్‌ అవుతుందా? రక్షణ చర్యలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఒక్కసారి పూర్తిగా పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన చేస్తారు. గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య 12కు […]

Advertisement
Update:2020-05-08 06:15 IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ అదుపులోకి వచ్చింది. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారంగా ప్రకటించనున్నారు. గుజరాత్‌ నుంచి వచ్చిన బృందం గ్యాస్‌ లీకేజ్‌ను ఆపేందుకు ఎంతో శ్రమించింది. ఎట్టకేలకు గ్యాస్ లీక్ ఆగింది. దీంతో కంపెనీలో ఇంకా ఎక్కడి నుంచి అయినా గ్యాస్‌ లీక్‌ అవుతుందా? రక్షణ చర్యలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఒక్కసారి పూర్తిగా పరిశీలన తర్వాత అధికారిక ప్రకటన చేస్తారు.

గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు క్రమంగా కోలుకుంటున్నారు.
విష వాయువుల తీవ్రతను తగ్గించడంలో ఉపకరించే పారా టెరిటరీ బ్యూటైల్‌ కాటెకాల్‌ (పీటీబీసీ) కెమికల్స్‌ గుజరాత్‌లోని వాసి నగరంలోని పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున తయారవుతోంది.. ఈ కెమికల్స్ ను‌ రాత్రి తెప్పించారు.

గుజరాత్‌లోని వల్సద్‌ జిల్లా వాపీలోని పరిశ్రమ నుంచి 500 కేజీల రసాయనాన్ని దామన్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తరలించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీక్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ పీటీబీసీ రసాయనాన్ని పిచికారి చేస్తున్నారు. దీంతో గాలిలో స్టైరిన్‌ తీవ్రత తగ్గుతోంది.

మరోవైపు ఎప్పటికప్పుడు గాలిలో విష వాయువు తీవ్రతను గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విషవాయువు తీవ్రత అంచనా వేస్తున్నారు. ఈ సాయంత్రానికి పరిస్థితులు చక్కబడుతాయని….భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా కల్పిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News