ఫస్ట్‌ డే ఫుల్... సెకండ్‌ డే డల్... తగ్గిన లిక్కర్‌ సేల్స్‌

తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మొదటి రోజు వైన్స్‌ ముందు భారీగా మందుబాబులు క్యూ కట్టారు. సాయంత్రం వరకూ షాపులు కళకళలాడాయి. తొలి రోజు దాదాపు 90 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. 45 రోజుల తరువాత వైన్‌షాపులు తెరుచుకోవడంతో భారీగా వచ్చిన జనం….. వారం, పదిరోజులకు సరిపడే మందు కొనుగోలు చేశారు. తొలి రోజు భారీగా అమ్మకాలు జరిగితే…రెండో రోజు తగ్గాయి. సగానికి సగం లిక్కర్‌ సేల్స్‌ పడిపోయాయి. గురువారం 40 కోట్ల రూపాయల అమ్మకాలు మాత్రమే జరిగాయని […]

Advertisement
Update:2020-05-08 07:36 IST

తెలంగాణలో మద్యం అమ్మకాలు తగ్గాయి. మొదటి రోజు వైన్స్‌ ముందు భారీగా మందుబాబులు క్యూ కట్టారు. సాయంత్రం వరకూ షాపులు కళకళలాడాయి. తొలి రోజు దాదాపు 90 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. 45 రోజుల తరువాత వైన్‌షాపులు తెరుచుకోవడంతో భారీగా వచ్చిన జనం….. వారం, పదిరోజులకు సరిపడే మందు కొనుగోలు చేశారు.

తొలి రోజు భారీగా అమ్మకాలు జరిగితే…రెండో రోజు తగ్గాయి. సగానికి సగం లిక్కర్‌ సేల్స్‌ పడిపోయాయి. గురువారం 40 కోట్ల రూపాయల అమ్మకాలు మాత్రమే జరిగాయని తెలుస్తోంది.

అయితే తొలి మూడు రోజులు భారీగా రద్దీ ఉంటుందని అధికారులు భావించారు. తీరా సీన్‌ కట్‌ చేస్తే రెండో రోజే అమ్మకాలు తగ్గాయి. దాదాపు రెండు నెలలుగా పని లేకపోవడంతో కార్మికులు, రోజూ వారీ కూలీలు మందు కొనేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న డబ్బుని కొంచెం దాచిపెట్టి…మిగిలిన సొమ్ముతోనే మందు కొన్నారని తెలుస్తోంది. రోజువారీ కూలీల దగ్గర చేతిలో మళ్లీ ఆదాయం పెరిగితేనే మద్యం అమ్మకాలు పెరుగుతాయని అధికారుల అంచనా.

ఇక వైన్‌షాపుల యజమానులు డిపోల నుంచి 150 కోట్లరూపాయల మద్యం కొనుగోలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 40 కోట్ల రూపాయల విలువచేసే లిక్కర్ ను‌ వైన్‌షాపుల్లో నిల్వ చేశారని సమాచారం. వేసవి కావడంతో బీరుకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని… వైన్‌షాపుల యజమానులు ఎక్కువగా స్టాక్‌ తెప్పించినట్లు తెలుస్తోంది.

మరోవైపు డిస్టిలరీలో మద్యం తయారీ బుధవారం నుంచి ప్రారంభమైంది. అయితే ఆ మందు షాపుల వరకు వచ్చేందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా వైన్‌షాపుల యజమానులు స్టాక్‌ నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటు లాక్‌డౌన్‌ సమయంలో బ్లాక్‌లో పెద్ద ఎత్తున మద్యం విక్రయించారు. ఈ కారణంతోనే దుకాణాల్లో స్టాక్‌ అయిపోయిందని…. అందుకే ఇప్పుడు వెంటనే స్టాక్‌ తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News