నేటి నుంచి తెరుచుకోనున్న మద్యం షాపులు

16 శాతం మేర పెరిగిన ధరలు వైన్స్ అనుమతులపై కేసీఆర్ ఏం అన్నారంటే..! కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. తెలంగాణలో మార్చి 23 నుంచే లాక్‌డౌన్ అమలు కావడంతో మిగతా వ్యాపారాలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూతబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపులను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కేసీఆర్ భావించిన తరుణంలో బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. మద్యం దుకాణాలను అనుమతించవద్దని పలువురి నుంచి విజ్ఞప్తులు […]

Advertisement
Update:2020-05-06 02:22 IST
  • 16 శాతం మేర పెరిగిన ధరలు
  • వైన్స్ అనుమతులపై కేసీఆర్ ఏం అన్నారంటే..!

కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. తెలంగాణలో మార్చి 23 నుంచే లాక్‌డౌన్ అమలు కావడంతో మిగతా వ్యాపారాలతో పాటు మద్యం దుకాణాలు కూడా మూతబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ సడలింపులను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కేసీఆర్ భావించిన తరుణంలో బుధవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి.

మద్యం దుకాణాలను అనుమతించవద్దని పలువురి నుంచి విజ్ఞప్తులు వచ్చినా తెరవక తప్పడం లేదని.. దానికి గల కారణాలు ఇవేనని కేసీఆర్ చెప్పారు. తెలంగాణకు నాలుగు రాష్ట్రాలు సరిహద్దుగా ఉన్నాయి. ఏపీతో 890 కిలోమీటర్లు, మహారాష్ట్రతో దాదాపు 700 కిమీ, కర్ణాటకతో 496 కిమీ, చత్తీస్‌గడ్‌తో 235 కిమీ ల సరిహద్దు ఉంది. సోమవారం నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. దీంతో సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారు. ఇదే కంటిన్యూ అయితే కరోనా తిరిగి వ్యాపించే అవకాశం ఉంది.

మరోవైపు గతంలో ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అకున్ సభర్వాల్ నేతృత్వంలో గుడుంబా బట్టీలను నాశనం చేశాం. తెలంగాణలో గుడుంబా లేకుండా చేశాం. కాని ఇప్పుడు మద్యం లేకపోవడంతో ఆయా బట్టీలు తిరిగి మొదలు పెట్టినట్లు సమాచారం వచ్చింది. మరోవైపు అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశిస్తోంది. స్థానిక డిస్టిలరీలు కూడా లైసెన్సులు కట్టి నష్టపోతున్నామని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చామని కేసీఆర్ చెప్పారు.

ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి అని కేసీఆర్ చెప్పారు. దీనికి యజమానులే బాధ్యత వహించాలన్నారు. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లు అన్నింటిలో అమ్మకాలు కొనసాగుతాయని.. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో ఉన్న 15 మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం లేదన్నారు.

మరోవైపు ఈ రోజు నుంచి మద్యం ధరలను కూడా పెంచారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా 50 లేదా 75 శాతం ధరలు పెంచడం లేదన్నారు. బ్రాండ్ల ఆధారంగా 11 నుంచి 16 శాతం వరకు రేట్లు పెరుగుతాయన్నారు. చీప్ లిక్కర్‌పై 11 శాతం.. మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంచనున్నారు. కాగా, పెంచిన ధరల ప్రకారం, రూ. 90గా ఉండే క్వార్టర్ లిక్కర్ బాటిల్ ధర రూ. 100 కానుండగా, రూ. 130 ఉండే బాటిల్ ధర రూ. 150కి పెరగనుంది.

Tags:    
Advertisement

Similar News