మోడీని అన్‌ఫాలో చేసిన వైట్‌హౌస్

మోడీతో ట్విట్టర్‌ స్నేహానికి వైట్‌హౌస్ గుడ్‌బై చెప్పేసింది. మోడీ ట్విట్టర్‌ ఖాతాను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేసేసింది. ఏప్రిల్‌ 10 నుంచి మోడీ ఖాతాను వైట్‌హౌస్‌ ఫాలో అవుతోంది. దాంతో వైట్‌హౌస్ ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడు నరేంద్రమోడీ అన్న ప్రచారం జరిగింది. బీజేపీ శ్రేణులు దాన్ని చాలా గొప్పగా భావించాయి. మూడు వారాల క్రితం నుంచి మోడీ ట్విట్టర్‌ ఖాతాతో పాటు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, అమెరికాలోని భారత్ ఎంబసీ ట్విట్టర్ హ్యాండిళ్లను కూడా […]

Advertisement
Update:2020-04-30 02:11 IST

మోడీతో ట్విట్టర్‌ స్నేహానికి వైట్‌హౌస్ గుడ్‌బై చెప్పేసింది. మోడీ ట్విట్టర్‌ ఖాతాను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేసేసింది. ఏప్రిల్‌ 10 నుంచి మోడీ ఖాతాను వైట్‌హౌస్‌ ఫాలో అవుతోంది. దాంతో వైట్‌హౌస్ ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడు నరేంద్రమోడీ అన్న ప్రచారం జరిగింది. బీజేపీ శ్రేణులు దాన్ని చాలా గొప్పగా భావించాయి. మూడు వారాల క్రితం నుంచి మోడీ ట్విట్టర్‌ ఖాతాతో పాటు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, అమెరికాలోని భారత్ ఎంబసీ ట్విట్టర్ హ్యాండిళ్లను కూడా వైట్ హౌస్ ఫాలో అయింది.

ఇప్పుడు హఠాత్తుగా ఆ ఖాతాలన్నింటిని వైట్‌హౌస్ అన్‌ ఫాలో కావడం చర్చనీయాంశమైంది. వైట్‌హౌస్ ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై స్పష్టత లేకపోయినా… అమెరికా, భారత్‌ ల మధ్య సంబంధాలను ఈ పరిణామం బట్టి కూడా అంచనా వేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భారత్- అమెరికా మధ్య సంబంధాలు సానుకూలంగా లేవన్న విషయం ఈ పరిణామం ఆధారంగా భావించాల్సి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. తొలి నుంచి ఫాలో అయి ఉండకపోతే సమస్య ఉండేది కాదని… ఏప్రిల్‌ 10 నుంచి ఫాలో అయి ఇప్పుడు హఠాత్తుగా అన్‌ఫాలో చేయడం గౌరవపద్రమైన పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News