కేసీఆర్ బాటలో రోజా.... కరోనా శాపం ఇచ్చింది

నగరి నియోజకవర్గంలోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో నీటి కష్టాలు చూసి ఇటీవల ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా చలించిపోయారు. వెంటనే ఆ కొన్ని ఇళ్లున్న కాలనీలో బోర్ వేయించారు.. కొన్ని డ్రంబులు కూడా కొనిచ్చి ప్రజలందరికీ తాగు నీటి కష్టాలు తీర్చారు. ఎమ్మెల్యే రోజా ఆగమేఘాల మీద తమ సమస్యలు తీర్చడంతో అక్కడి కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా ఆమె కాళ్ళ మీద పువ్వులు చల్లి అభిమానం చాటుకున్నారు. […]

Advertisement
Update:2020-04-28 11:37 IST

నగరి నియోజకవర్గంలోని నగరి మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో నీటి కష్టాలు చూసి ఇటీవల ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా చలించిపోయారు. వెంటనే ఆ కొన్ని ఇళ్లున్న కాలనీలో బోర్ వేయించారు.. కొన్ని డ్రంబులు కూడా కొనిచ్చి ప్రజలందరికీ తాగు నీటి కష్టాలు తీర్చారు.

ఎమ్మెల్యే రోజా ఆగమేఘాల మీద తమ సమస్యలు తీర్చడంతో అక్కడి కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏకంగా ఆమె కాళ్ళ మీద పువ్వులు చల్లి అభిమానం చాటుకున్నారు. ఇలాంటి నేత మరొకరు లేరంటూ కొనియాడారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను బేస్ చేసుకొని ప్రతిపక్ష టీడీపీ, దాని సోషల్ మీడియా ట్రోలింగ్ చేశారు. సామాజిక దూరం పాటించకుండా రోజా ఇలా పూలు చల్లించుకున్నారని.. కరోనా వ్యాపింపచేశారని ఆరోపించారు. ఇది వైరల్ కావడంతో తాజాగా రోజా బయటకొచ్చారు. ఓ న్యూస్ చానెల్ తో మాట్లాడిన రోజా ప్రతిపక్ష టీడీపీ పై నిప్పులు చెరిగారు.

టీడీపీ ఇన్నేళ్లు పాలించిందని… ప్రజల సమస్యలను మాత్రం గాలికి వదిలేసిందని రోజా మండిపడ్డారు. తమ ప్రభుత్వం సమస్యలు తీర్చడంతో ప్రజలే అభిమానంతో తనపై పూలు చల్లారని వివరణ ఇచ్చారు. సోషల్ డిస్టేన్స్ పాటిస్తూనే వారు పూలు చల్లారని తెలిపారు. అయితే తాను నడుచుకుంటూ వెళుతున్న వీడియోను ఎడిట్ చేసి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని రోజా ఆరోపించారు.

టీడీపీ ఆగడాలు, దాని ఎల్లో మీడియా విష ప్రచారం చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అన్నట్టు కరోనాపై అవాకులు చెవాకులు పేల్చుతున్న టీడీపీ నాయకులకు, మీడియా సంస్థల యజమానులకు కరోనా రావాలని రోజా శపించారు. అబద్ధాలాడే వాళ్లకు అలాంటి శాస్తి జరగాల్సిందేనని అన్నారు.

Tags:    
Advertisement

Similar News