ఎక్కువ పరీక్షల వల్ల కేసులు బయటపడుతున్నాయి " జవహర్‌ రెడ్డి

ఎక్కువ పరీక్షలు చేస్తుండడం వల్లే ఏపీలో ఎక్కువ కరోనా కేసులు బయటపడుతున్నాయని ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరించారు. ఏపీలో కరోనా వ్యాప్తి రేటు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉందని గణాంకాలు వివరించారు. తక్కువ పరీక్షలు చేస్తే తక్కువ పాజిటివ్ కేసులు వస్తాయని.. కానీ దాని వల్ల సమాజంలో వైరస్‌ విస్తరిస్తుందన్నారు. అందుకే ఎక్కువ పరీక్షలు చేసి వైరస్ బాధితులను తక్షణం గుర్తిస్తే ఇతరులకు వ్యాపించకుండా […]

Advertisement
Update:2020-04-28 13:57 IST

ఎక్కువ పరీక్షలు చేస్తుండడం వల్లే ఏపీలో ఎక్కువ కరోనా కేసులు బయటపడుతున్నాయని ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరించారు. ఏపీలో కరోనా వ్యాప్తి రేటు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువగా ఉందని గణాంకాలు వివరించారు.

తక్కువ పరీక్షలు చేస్తే తక్కువ పాజిటివ్ కేసులు వస్తాయని.. కానీ దాని వల్ల సమాజంలో వైరస్‌ విస్తరిస్తుందన్నారు. అందుకే ఎక్కువ పరీక్షలు చేసి వైరస్ బాధితులను తక్షణం గుర్తిస్తే ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చన్నారు.

కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. నమోదు అవుతున్న దాదాపు కరోనా కేసులన్నీ ఇప్పటికే ఉన్న క్లస్టర్లలో వస్తున్నాయన్నారు. క్లస్టర్లలోని పాజిటివ్ కేసులు త్వరగా గుర్తించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. పాజిటివ్ కేసు వస్తే అతడి చుట్టూ ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇప్పటి వరకు 80వేల 334 పరీక్షలు నిర్వహించామని చెప్పారు. హోం ఐసోలేషన్ సాధ్యం కాని వారు… ప్రతి జిల్లాలోనూ 300 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్‌ సెంటర్‌లో ఉండవచ్చన్నారు. అక్కడ డాక్టర్ కూడా ఉంటారని వివరించారు.

Tags:    
Advertisement

Similar News