పరీక్షలు ఎక్కువ చేస్తే కేసులు పెరుగుతాయి... అయినా భయపడొద్దు...

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కీలక సూచనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు తక్కువ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు బయటకు రావడం లేదు. అసలు పరీక్షలే సరైన మోతాదులో నిర్వహించకుండా తమ రాష్ట్రాల్లో కరోనా తగ్గిపోయిందని ప్రచారం చేసుకుంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వైరస్‌ బారినపడిన వారిని తక్షణం గుర్తించి, వారిని ఐసోలేట్ చేయడం ద్వారా మరింత మందికి వ్యాధి విస్తరించకుండా అడ్డుకునేందుకు భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా భారీగా […]

Advertisement
Update:2020-04-27 07:45 IST

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ కీలక సూచనలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు తక్కువ పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు బయటకు రావడం లేదు. అసలు పరీక్షలే సరైన మోతాదులో నిర్వహించకుండా తమ రాష్ట్రాల్లో కరోనా తగ్గిపోయిందని ప్రచారం చేసుకుంటున్నాయి.

మరికొన్ని రాష్ట్రాలు మాత్రం వైరస్‌ బారినపడిన వారిని తక్షణం గుర్తించి, వారిని ఐసోలేట్ చేయడం ద్వారా మరింత మందికి వ్యాధి విస్తరించకుండా అడ్డుకునేందుకు భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా భారీగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.

ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో కొద్దిరోజులుగా కరోనా కేసులు ఎక్కువగానే బయటపడుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని విపక్షాలు, మీడియా సంస్థలు ఏపీలో ప్రజలను భయపెట్టేలా కథనాలు రాస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ కీలక సూచనలు చేశారు. కొన్ని రాష్ట్రాలు భారీగా పరీక్షలు నిర్వహిస్తున్నాయని… దాని వల్ల తక్షణం ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని గౌబ అభిప్రాయపడ్డారు. ఎక్కువ పరీక్షలు చేయడం వల్ల కేసులు పెరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఎక్కువ పరీక్షలు చేసి కరోనా బాధితులను గుర్తించడం మంచి పరిణామమని… దాని వల్ల ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని సూచించారు. కాబట్టి కేసులు అధికంగా నమోదైనా సరే ఆందోళన చెందవద్దని… పరీక్షల నిర్వహణలో ముందుకెళ్లాలని రాజీవ్ గౌబ సలహా ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News