48 గంటల్లో 142 కరోనా కేసులు... ఆ 3 జిల్లాల్లోనే అత్యధికం
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 81 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. వీరిలో 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 835. ఇప్పటివరకూ ఏపీలో 68,034 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66,937 మంది నెగటివ్‌గా తేలింది. 1097 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లాల వారీగా వివరాలు చూస్తే 24 గంటల్లో […]
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 81 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీంతో
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది. వీరిలో 231 మంది డిశ్చార్జ్ అయ్యారు. 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 835.
ఇప్పటివరకూ ఏపీలో 68,034 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 66,937 మంది నెగటివ్‌గా తేలింది.
1097 మందికి పాజిటివ్ వచ్చింది.
జిల్లాల వారీగా వివరాలు చూస్తే 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలులో 4, పశ్చిమగోదావరిలో 12, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 3, కడపలో 3, అనంతపురంలో 2 కేసులు బయటపడ్డాయి.
కర్నూలులో 279 పాజిటివ్ కేసులు తేలాయి. వీరిలో 31 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తొమ్మిది మంది చనిపోయారు.
గుంటూరులో 214 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే చికిత్స పొంది కోలుకున్న వారు 29 మంది. 8 మంది వైరస్‌తో మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 177.
కృష్ణాలో 177 పాజిటివ్ కేసులు ఉంటే…140 యాక్టివ్ గా ఉన్నాయి. 29 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మృతి చెందారు.
ఏపీలో మొత్తం 1097 కేసులు ఉంటే…దాదాపు 70 శాతం కేసులు మూడు జిల్లాల నుంచి నమోదు అయ్యాయి. కర్నూలు 279, గుంటూరు 214, కృష్ణా 177. ఈ మూడు జిల్లాల కేసులు కలిపితే 670.
మొన్నటివరకూ ఒక్క కేసు లేని శ్రీకాకుళంలో ప్రస్తుతం మూడు కేసులు నమోదు అయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా బయటపడలేదు.
మరోవైపు శనివారం 61 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల్లో భారీగా కేసులు పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదివారం మాంసం దుకాణాలు కూడా తెరవకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.