ఇళ్ల పట్టాల పంపిణీకి కొత్త ముహూర్తం
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మరో ముహూర్తాన్ని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జులై 8న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల పట్టాలతో పాటు ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇల్లు కూడా నిర్మించి ఇస్తుందని సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు. తొలుత ఇళ్లపట్టాలు ఉగాది నాడు అందజేయాలని భావించారు. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు […]
ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మరో ముహూర్తాన్ని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జులై 8న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల పట్టాలతో పాటు ప్రభుత్వమే వారికి ఉచితంగా ఇల్లు కూడా నిర్మించి ఇస్తుందని సీఎం జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
తొలుత ఇళ్లపట్టాలు ఉగాది నాడు అందజేయాలని భావించారు. కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీకి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అటు సీఎం జగన్‌మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు.
ఆన్‌లైన్‌లో బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని 8లక్షల 78వేల 874 పొదుపు సంఘాల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయింది. 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి.