గోవా 'జీరో కరోనా' కేసులు ఎలా సాధించింది ?

దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు అసలు లేని రాష్ట్రంగా గోవా రికార్డు సృష్టించింది. దేశంలో అత్యధిక పర్యాటకులు వచ్చే రాష్ట్రంగా పేరు గాంచిన గోవాకు కరోనా త్వరగానే పాకింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేని రాష్ట్రంగా మారిపోయింది. దీనికి కారణం డాక్టర్ ఎడ్విన్ గోమెజ్. గోవాను కరోనా బారి నుంచి బయట పడేసింది డాక్టర్ గోమెజ్ అంటూ స్వయంగా […]

Advertisement
Update:2020-04-21 02:57 IST

దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు అసలు లేని రాష్ట్రంగా గోవా రికార్డు సృష్టించింది. దేశంలో అత్యధిక పర్యాటకులు వచ్చే రాష్ట్రంగా పేరు గాంచిన గోవాకు కరోనా త్వరగానే పాకింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ కృషితో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేని రాష్ట్రంగా మారిపోయింది.

దీనికి కారణం డాక్టర్ ఎడ్విన్ గోమెజ్. గోవాను కరోనా బారి నుంచి బయట పడేసింది డాక్టర్ గోమెజ్ అంటూ స్వయంగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణే ట్విట్టర్ సాక్షిగా ప్రశంసించారు. గోవాలో ఉన్న ఏకైక మెడికల్ కాలేజీలో మెడిసిన్ విభాగాధిపతి, కరోనా చికిత్సకు నోడల్ అధికారిగా వ్యవహరించిన డాక్టర్ ఎడ్విన్ గోమెజ్ కరోనాపై ఎనలేని పోరాటాన్ని చేశారు.

మానవాళి పాలిట ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ బారి నుంచి రోగులను బయటపడేసేందుకు ఎడ్విన్‌తో పాటు ఈఎస్ఐ ఆసుపత్రి సిబ్బంది, ఇతర వైద్యులు ఎనలేని కృషి చేశారు. కేవలం వైద్యం అందించడమే కాకుండా పేషెంట్లకు ధైర్యాన్ని నూరిపోశారు.

కరోనా చికిత్స తీసుకుంటున్న రోగులు ఒక్కోసారి తీవ్ర ఒత్తిడిలో ఉండేవాళ్లు.. ఆ సమయంలో డాక్టర్ గోమెజ్ వాళ్ల దగ్గరకు వెళ్లి ఓదార్పు మాటలు చెప్పేవాళ్లు. అంతే కాదు తాను కూడా ఒత్తిడితోనే ఉన్నాను.. చూడండి నేను కూడా మాత్రలు వేసుకుంటున్నానంటూ వాళ్ల ముందే మాత్రలు వేసుకుంటూ వారిని ఉత్సాహపరిచేవారని గోవాలో కరోనా వచ్చి కోలుకున్న తొలి పేషెంట్ ఎడ్గార్ రెమిడియోస్ చెప్పారు.

డాక్టర్ ఎడ్విన్ గోమెజ్ వయస్సు 58 సంవత్సరాలు. ఆయనకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని తెలిసి కూడా.. బాధితులు కోలుకోవడానికి దగ్గరుండి చికిత్స చేశారని.. కరోనా బాధితులను మామూలు స్థితికి తీసుకొని రావడానికి నిరంతరం తన సిబ్బందితో కలసి పోరాడారని ప్రముఖ వైద్యుడు ఆస్కార్ రెబెలో చెప్పారు.

వైద్య వృత్తి పట్ల నిబద్దత కలిగిన గోమెజ్.. ఎంతో అంకిత భావంతో పని చేయడం వల్లే.. ఈ రోజు గోవా రాష్ట్రం ‘జీరో కరోనా’ కేసులతో రికార్డు సృష్టించిందని పలువురు కొనియాడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News