ఏపీ రెడ్‌జోన్ జిల్లాల వెనుక అసలు నిజం...
ఏపీలోని 11 జిల్లాలను రెడ్‌జోన్ జిల్లాలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జగన్‌మోహన్ రెడ్డి వైఫల్యం వల్లే 11 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో 8 జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉండగా… ఏపీలోని 13 జిల్లాల్లో ఏకంగా 11 జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్లాయని… ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే అని టీడీపీ ఆరోపిస్తోంది. కేంద్రం ఏపీలోని 11 జిల్లాలను రెడ్ జోన్ జిల్లాలుగా […]
ఏపీలోని 11 జిల్లాలను రెడ్‌జోన్ జిల్లాలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆధారంగా చేసుకుని టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. జగన్‌మోహన్ రెడ్డి వైఫల్యం వల్లే 11 జిల్లాలు రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో 8 జిల్లాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉండగా… ఏపీలోని 13 జిల్లాల్లో ఏకంగా 11 జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్లాయని… ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే అని టీడీపీ ఆరోపిస్తోంది.
కేంద్రం ఏపీలోని 11 జిల్లాలను రెడ్ జోన్ జిల్లాలుగా ప్రకటించడానికి కారణాలు వేరే ఉన్నాయి. రెడ్ జోన్ జిల్లాల ఎంపికలో కేంద్రం అనుసరించిన విధానం వల్లే ఏపీలో ఎక్కువ జిల్లాలు రెడ్‌జోన్ లోకి వెళ్లాయి. కరోనా కేసుల నమోదు ఆధారంగా జిల్లాను యూనిట్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా రెడ్‌జోన్ లను కేంద్రం ప్రకటించింది.
ప్రస్తుతం చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జిల్లాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఏపీలో ఒక్కో జిల్లా విస్తీర్ణం, జనాభా మాత్రం అధికంగా ఉంది. ఉదాహరణకు విశాఖ జిల్లాను తీసుకుంటే రెడ్‌జోన్‌లు ప్రకటించే సమయానికి ఆ జిల్లాలో 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ ఈ 20 కేసుల్లో 14 విశాఖ అర్బన్ మండలంలో కాగా… మిగిలిన ఆరు కేసులు మరో రెండు మండలాల్లో నమోదు అయ్యాయి. జిల్లాలోని మిగిలిన మండలాల్లో ఎక్కడా కూడా కరోనా కేసులు నమోదు కాలేదు.
కానీ కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్ జిల్లాలను ఎంపిక చేయడంతో విశాఖ జిల్లా మొత్తం రెడ్ జోన్ జిల్లాగా మారిపోయింది. దాదాపు అన్ని జిల్లాల్లో కేసులు కొన్ని మండలాలకే పరిమితం అయ్యాయి. మిలిగిన మండలాల్లో ఎలాంటి కరోనా ప్రభావం లేదు. అయినా సరే జిల్లాను యూనిట్‌గా తీసుకోవడంతో మొత్తం జిల్లాలకు జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయాయి.
ఏపీలో 676 మండలాలు ఉండగా… కరోనా కేసులన్నీ కేవలం 89 మండలాల్లోనే నమోదు అయ్యాయి. అంటే మొత్తం మండలాల్లో 13. 16 శాతం మండలాల్లో మాత్రమే కరోనా కేసులున్నాయి. మండలాలను యూనిట్‌గా తీసుకుని ఉంటే 587 మండలాలు గ్రీన్ జోన్‌లో ఉండేవి. కానీ జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం, ఏపీలో జిల్లాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడం, సంఖ్య తక్కువగా ఉండడంతో 11 జిల్లాలు రెడ్‌జోన్ జిల్లాలుగా మారాయి.
పక్కనే ఉన్న తెలంగాణ ఏపీ కంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ అక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. చిన్నచిన్న జిల్లాలు కావడంతో చాలా జిల్లాలు రెడ్‌జోన్ నుంచి తప్పించుకోగలిగాయి. తెలంగాణలో కూడా ఇది వరకులాగే 10 జిల్లాలు మాత్రమే ఉంటే అక్కడ కూడా ఏపీ తరహాలోనే దాదాపు అన్ని జిల్లాలు రెడ్‌జోన్ లలోకి వెళ్లి ఉండేవి.
ఏపీలో జిల్లాల సంఖ్య తక్కువగా ఉన్నందున… మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్ లను ఎంపిక చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. కానీ దేశ వ్యాప్తంగా జిల్లాను యూనిట్‌గా తీసుకోవడంతో ఏపీకి ఇబ్బంది వచ్చింది.
ఏపీలో కూడా తెలంగాణ తరహాలో చిన్నచిన్న జిల్లాలు భారీగా ఉండి ఉంటే చాలా జిల్లాలు రెడ్ జోన్‌లో కాకుండా గ్రీన్‌జోన్‌లో ఉండేవి. కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకోవడం వెనుక దురుద్దేశాలు కూడా ఏమీ లేవు.
ఏది ఏమైనా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్ లను ఎంపిక చేసి ఉంటే… ఏపీలో 86. 84 శాతం మండలాలు గ్రీన్ జోన్ లో ఉండేవి. కానీ జిల్లాను యూనిట్‌గా కేంద్రం తీసుకోవడంతోనే ఏపీలో 11 జిల్లాలు ఎక్కువ రెడ్‌జోన్ లుగా ఉన్నాయి.