అరెస్ట్‌ భయమా? ఎల్లో లింక్‌ భయమా? నిమ్మగడ్డ వివరణ వెనుక కథేంటి?

కలుగులో పొగ పెడితే ఎలుక బయటకు వచ్చినట్లు….రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీకి రాసిన లేఖతో ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బయటకు వచ్చాడు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై మౌనం వీడాడు. ఆ లేఖ రాసింది తానే అని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని వివాదం చేయొద్దని కోరాడు. కేంద్రానికి రాసిన లేఖపై రమేష్‌ కుమార్ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడు? తానే రాశానని ఎందుకు గతంలో చెప్పుకోలేకపోయాడు? టీడీపీ అనుకూల మీడియా […]

Advertisement
Update:2020-04-16 01:49 IST

కలుగులో పొగ పెడితే ఎలుక బయటకు వచ్చినట్లు….రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీకి రాసిన లేఖతో ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బయటకు వచ్చాడు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై మౌనం వీడాడు. ఆ లేఖ రాసింది తానే అని ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని వివాదం చేయొద్దని కోరాడు.

కేంద్రానికి రాసిన లేఖపై రమేష్‌ కుమార్ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నాడు? తానే రాశానని ఎందుకు గతంలో చెప్పుకోలేకపోయాడు? టీడీపీ అనుకూల మీడియా చానళ్లలో మొదట అదొక ఫోర్జరీ లేఖ అని ఎందుకు చెప్పించాడు? ఆ తర్వాత కేంద్ర బలగాల భద్రత రావడంతో ఎందుకు మాట మార్చాడు? అప్పటి నుంచి లేఖపై స్పష్టత ఇవ్వని రమేష్‌ కుమార్‌… ఇప్పుడు ఎందుకు స్పష్టత ఇచ్చాడు? అని ఆరాతీస్తే అసలు విషయం తెలిసింది.

కేంద్రహోంశాఖకు రమేష్‌ కుమార్ రాసిన లేఖపై అనుమానాలు ఉన్నాయని… అది ఆయన రాసిందో… కాదో… తేల్చాలని ఏపీ డీజీపీకి ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో రమేష్‌ కుమార్‌ తాను ఇరుక్కుంటానని… తేడా వస్తే తనను అరెస్టు చేస్తారనే భయంతో ముందుగానే బయటకు వచ్చినట్లు తెలిసింది. లేఖ తానే రాశానని ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తానే లేఖ రాశానని కూడా హోంశాఖ ధ్రువీకరించిందని చెప్పుకొచ్చాడు.

అయితే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తాజా వివరణపై వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది. హోంశాఖకు లేఖ తానే రాశానని చెబుతున్న రమేష్‌ కుమార్‌…. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది.

కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై సంతకం చేసింది ఆయనేనా? లేఖను ఏ ఐపీ అడ్రస్‌ నుండి హోంశాఖకు పంపారు? ఈ లేఖను రాసింది ఎవరు…. రెడీ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెబితే సంతృప్తికరంగా ఉంటుందని.. లేకపోతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేంద్రం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు లేఖను పంపాలని ఏపీ డీజీపీని వైసీపీ కోరింది.

Tags:    
Advertisement

Similar News