4 నగరాల్లో 60 శాతం కరోనా మరణాలు.... అసలు అక్కడేం జరుగుతోంది?

కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ… ప్రధానంగా నాలుగు నగరాల్లోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ 14 వరకూ చూసుకుంటే…. ముంబై, పూణె, ఇండోర్‌, ఢిల్లీ నగరాల్లోనే 60 శాతం మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే మహారాష్ట్రలో దాదాపు సగం మరణాలు సంభవించాయి. ఏప్రిల్‌ 14కి దేశవ్యాప్తంగా 382 కరోనా మరణాలు రిపోర్టయ్యాయి. ఇందులో 175 అంటే 45 శాతం మహారాష్ట్రలోనే సంభవించాయి. థానే, వసై, పన్వెల్‌, నవీముంబయ్‌, మీరా భయందర్‌లతో కలుపుకుని ముంబై మెట్రోపాలిటన్‌ ఏరియాలో 127 మరణాలు […]

Advertisement
Update:2020-04-15 11:33 IST

కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ… ప్రధానంగా నాలుగు నగరాల్లోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి.

ఏప్రిల్‌ 14 వరకూ చూసుకుంటే…. ముంబై, పూణె, ఇండోర్‌, ఢిల్లీ నగరాల్లోనే 60 శాతం మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తే మహారాష్ట్రలో దాదాపు సగం మరణాలు సంభవించాయి.

ఏప్రిల్‌ 14కి దేశవ్యాప్తంగా 382 కరోనా మరణాలు రిపోర్టయ్యాయి. ఇందులో 175 అంటే 45 శాతం మహారాష్ట్రలోనే సంభవించాయి. థానే, వసై, పన్వెల్‌, వీముంబయ్‌, మీరా భయందర్‌లతో కలుపుకుని ముంబై మెట్రోపాలిటన్‌ ఏరియాలో 127 మరణాలు లెక్క తేలాయి. పూణెలో 38 మంది చనిపోయారు.

దేశం వ్యాప్తంగా కరోనా వల్ల 382 మంది చనిపోతే…. అందులో ముంబై, పూణె, ఇండోర్‌, ఢిల్లీ నగరాల్లోనే 232 మంది చనిపోయారు. మొత్తం మరణాల్లో ఇది 60 శాతం. అహ్మదాబాద్‌లో 13 మంది హైదరాబాద్‌లో 12 మంది మరణించారు. ఢిల్లీలో 30 మంది కరోనా వల్లే మరణించారు.

ఇండోర్‌లో 37 మందితో కలిపి మధ్యప్రదేశ్‌లో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నమోదయిన కేసులతో పోల్చితే, మరణాల రేటు ఎక్కువున్నట్టు తేలింది. పూణెలో 374 కేసులు బయటపడితే, అందులో 38 మంది చనిపోయారు. అంటే, ప్రతి 10 కేసులకీ ఒకరు మరణించారన్నమాట.

ఇక ఇండోర్‌లో 411 మందికి పాజిటివ్‌ రాగా, 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే, ప్రతి 11 మందిలో ఒకరు చనిపోయారు. ఇండోర్‌లో బయటపడిన పాజిటివ్‌ కేసుల్లో, ప్రాణాలు పోయినవారిలో ఎక్కువమందికి ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్‌ సమావేశాలతో సంబంధం ఉందని తేలింది.

Tags:    
Advertisement

Similar News