ఏపీలో 22 వేల వైఎస్‌ఆర్ జనతా బజార్లు
వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసేదిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ‘వైయస్సార్ జనతా బజార్లు’ పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు ఉండాలని సీఎం జగన్ అన్నారు. మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. దాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్‌వర్క్ ఏర్పడుతుందని […]
వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసేదిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో ‘వైయస్సార్ జనతా బజార్లు’ పెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు ఉండాలని సీఎం జగన్ అన్నారు.
మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. దాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్‌వర్క్ ఏర్పడుతుందని చెప్పారు. ఈ బజార్లలో
పాలు, పళ్లు, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులు అమ్మనున్నారు.
ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలని… వీటిలోనే ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావాలని సీఎం జగన్ అన్నారు. ఈమేరకు జనతాబజార్లపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
కరోనా వల్ల ఇప్పుడు మార్కెట్లు ఎక్కడెక్కడ అవసరమో తెలిసి వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనతాబజార్ల కోసం ప్రాంతాలను గుర్తించాలని సీఎం సూచించారు. జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
వైయస్సార్ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎం జగన్ సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఓ కోల్డ్ స్టోరేజీ ఉండే విధంగా ప్లాన్ చేయాలని అన్నారు.