మందు అడిగిన వర్మకు కేటీఆర్ పంచ్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ట్వీట్లు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మందు లభించక మందుబాబులు పిచ్చోళ్లుగా మారడం.. ఆస్పత్రుల పాలవడం.. మద్యం దొరక్క మరణాలు చూసి ఆ రాష్ట్రంలో లిక్కర్ షాపులు తెరవాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోబోతున్నారని వార్త వచ్చింది. ఆ వార్త ను షేర్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. […]

Advertisement
Update:2020-04-13 09:54 IST

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ట్వీట్లు చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.

తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మందు లభించక మందుబాబులు పిచ్చోళ్లుగా మారడం.. ఆస్పత్రుల పాలవడం.. మద్యం దొరక్క మరణాలు చూసి ఆ రాష్ట్రంలో లిక్కర్ షాపులు తెరవాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకోబోతున్నారని వార్త వచ్చింది.

ఆ వార్త ను షేర్ చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ సందర్భంగా ట్విట్టర్ లో కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్ కు ట్యాగ్ చేస్తూ ‘మందు దొరక్క జుట్టు రాలిపోతోందని.. ఇంట్లో భార్యలను కొడుతున్నారని.. గొడవలు అవుతున్నాయని.. పిచ్చోళ్లై ఆస్పత్రుల పాలవుతున్నారని.. మన రాష్ట్రంలోనూ ఆ భాగ్యం కలిగించండి.. మమతా బెనర్జీని ఫాలో అవ్వండి’ అని అడిగేశాడు.

దీనికి మంత్రి కేటీఆర్ సరదాగా స్పందించారు. ‘రామూ గారు.. మీరంటున్నది హెయిర్ కట్ గురించే అడుగుతున్నారు కదా’ అంటూ చమత్కరించారు.

దీనికి స్పందించిన వర్మ .. మరో ట్వీట్ చేస్తూ.. ‘కేటీఆర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందని.. ఆయన పంచ్ కు నా ముక్కు ఎర్రగా వాచిపోయిందని అన్నాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు నాకు నచ్చుతాయి’ అని చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News