రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రసంగం... ఏం చెప్పబోతున్నారు?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు మోదీ. లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక ప్రకటన చేస్తారు. ప్రధాని ప్రసంగంపై ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ గడువు ముగుస్తుంది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు కర్నాటక , మహారాష్ట్ర , పంజాబ్ , ఒడిశా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దీంతో మోదీ ఏం నిర్ణయ […]
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు మోదీ. లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక ప్రకటన చేస్తారు. ప్రధాని ప్రసంగంపై ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ గడువు ముగుస్తుంది. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు కర్నాటక , మహారాష్ట్ర , పంజాబ్ , ఒడిశా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. దీంతో మోదీ ఏం నిర్ణయ తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
లాక్‌డౌన్ మరో రెండువారాల పాటు అంటే ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తారా? లేక మూడు జోన్ లు గా విభజించి ఆంక్షలు అమలు చేస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
మొత్తానికి ప్రధానమంత్రి రేపు ఉదయం 10 గంటలకు ఏం చెబుతారోనని దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.