ఏపీలో వాటర్‌గ్రిడ్‌ " తొలి విడతలో 6 జిల్లాల్లో అమలు

ఏపీలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టబోతోంది. ఏపీలో పట్టణాలు, పల్లెల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నారు. తొలి విడతలో ఆరు జిల్లాలను ఎంపిక చేశారు. ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులను త్వరలో ప్రారంభిస్తారు. వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేస్తారు. సుమారు రూ.57,622 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలు చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, పల్నాడుతో పాటు గోదావరి జిల్లాల తీర ప్రాంతాల మంచి నీటి […]

Advertisement
Update:2020-04-12 07:20 IST

ఏపీలో తాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు చేపట్టబోతోంది. ఏపీలో పట్టణాలు, పల్లెల్లో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నారు. తొలి విడతలో ఆరు జిల్లాలను ఎంపిక చేశారు. ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులను త్వరలో ప్రారంభిస్తారు.

వాటర్‌గ్రిడ్‌తో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేస్తారు. సుమారు రూ.57,622 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలు చేయబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, పల్నాడుతో పాటు గోదావరి జిల్లాల తీర ప్రాంతాల మంచి నీటి కష్టాలు ఇక తొలిగిపోనున్నాయి.

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడపజిల్లాలో తొలి విడతగా వాటర్‌ గ్రిడ్ ప్రాజెక్టు చేపడుతారు. రోజుకు ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపల్ కార్పోరేషన్‌ ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలను సిద్దం చేశారు.

2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి… జూన్‌ నుంచి ఆరు జిల్లాల్లో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Tags:    
Advertisement

Similar News