ఏపీలో ఒక్కొక్కరికి మూడు మాస్కుల పంపిణీ
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం సీఎం జగన్ కీలక నిర్ణయం ఏపీలో కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ నిబంధనల అమలు, భవిష్యత్ కార్యాచరణమై సీఎం వైఎస్ జగన్ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ […]
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం
- సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీలో కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ నిబంధనల అమలు, భవిష్యత్ కార్యాచరణమై సీఎం వైఎస్ జగన్ ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలందరూ మాస్కులు తప్పని సరిగా ధరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రజలందరికీ మాస్కులు పంపిణీ చేయాలని.. ఒక్కొక్కరికి 3 మాస్కుల చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాదులు ఉన్నవారిని హైరిస్క్ కింద ప్రత్యేకంగా వైద్యం అందించాలని జగన్ కోరారు.
రాష్ట్రంలో ఉన్న 1.47 కోట్ల కుటుంబాలకు గాను 1.43 కోట్ల కుటుంబాల మూడో విడత సర్వే పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సర్వే చేసిన ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు 32,349 మందిని రిఫర్ చేశారని వారిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్థారించినట్లు వైఎస్ జగన్‌కు చెప్పారు. కాగా… 32,349 మందికి కూడా పరీక్షలు నిర్వహించాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న జోన్లలో 45 వేల మందికి కూడా పరీక్షలు చేస్తున్నట్లు వైద్యాదికారులు జగన్‌కు వివరించారు.
ఉమ్మి ద్వారా కరోనా సంక్రమించే అవకాశం అధికంగా ఉండటంతో రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై నిషేధం విధించారు. పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, పాన్లు నమిలి ఉమ్మేసే వారిపై ఐపీసీ 1860 సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్షలు విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక రైతు బజార్లు, మార్కెట్లలో సర్కిల్స్, మార్కింగ్ తప్పని సరిగా చేసి భౌతిక దూరం పాటించాలని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఇవాళ ఉదయం వరకు ఏపీలో 417 పాజిటీవ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కోవిడ్ నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ చేయాలని సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ 3 చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీకి సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 12, 2020