శనివారం లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని జనం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్‌ 11న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది. ఈమీటింగ్‌లోనే లాక్‌డౌన్‌పై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, దేశవ్యాప్తంగా నెలకొన్న […]

Advertisement
Update:2020-04-08 09:53 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మార్చి 24 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని జనం ఎదురుచూస్తున్నారు.

ఏప్రిల్‌ 11న ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగబోతోంది. ఈమీటింగ్‌లోనే లాక్‌డౌన్‌పై ప్రధాని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, అధికారుల సూచనల మేరకు లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

ఏప్రిల్‌ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేక రెండు రోజులు రిలీఫ్‌ ఇచ్చి..మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా? అనేది చూడాలి. అయితే ఇప్పటికే సింగపూర్‌తో పాటు పలుదేశాలు నెలరోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. దీంతో మనదేశంలో కూడా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ పొడిగించే సూచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు లాక్‌డౌన్‌ పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితి చేతుల్లో ఉందని… లాక్‌డౌన్‌ తొలగిస్తే చేయి దాటిపోయే అవకాశముందని వీరు హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల మిగతా దేశాల కంటే మనదేశంలో పరిస్థితి మెరుగ్గా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,194కు చేరింది. మరణాల సంఖ్య 149గా నమోదైంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఉత్తరప్రదేశ్‌లో 15 జిల్లాల సరిహద్దులను బుధవారం అర్ధరాత్రి నుండి పూర్తిగా మూసివేస్తున్నట్లు యోగి సర్కార్‌ ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News