లాక్‌డౌన్ ఎఫెక్ట్ : ఆన్‌లైన్ తరగతులకు పెరిగిన గిరాకీ

కరోనా ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ప్రభావంతో ముందు మూతపడింది విద్యాసంస్థలే. ఈ విద్యాసంవత్సరం పూర్తి కాకుండానే పాఠశాలలు, కళాశాలలు బంద్ అయ్యాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఐఐటీ, జేఈఈ, నీట్, గేట్ వంటి పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రతీ రోజు రివిజన్ చేసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వీరికి పరిపాటి. అంతే కాకుండా […]

Advertisement
Update:2020-04-08 06:10 IST

కరోనా ప్రభావంతో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. కరోనా ప్రభావంతో ముందు మూతపడింది విద్యాసంస్థలే. ఈ విద్యాసంవత్సరం పూర్తి కాకుండానే పాఠశాలలు, కళాశాలలు బంద్ అయ్యాయి. పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.

ఇక ఐఐటీ, జేఈఈ, నీట్, గేట్ వంటి పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థుల పరిస్థితి అయోమయంలో పడింది. ప్రతీ రోజు రివిజన్ చేసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వీరికి పరిపాటి. అంతే కాకుండా కోచింగ్ క్లాసులకు వెళ్తే వారానికి ఒక సారైనా పరీక్షలు పెడతారు. ఇప్పుడు వీళ్లందరూ ఇండ్లలోనే ఉంటూ ఎలాంటి గైడెన్స్ లేకుండా సొంతగా ప్రిపేర్ కావల్సిన పరిస్థితి.

ఇలాంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నడుపుతున్నాయి. ఇప్పటికే మనుగడలో ఉన్న ఈ-లెర్నింగ్ సంస్థలు కూడా విద్యార్థులకు అనుగుణంగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా పలు కంపెనీలకు నష్టాలు వస్తుండగా.. ఈ-లెర్నింగ్ సంస్థలు మాత్రం లాభాల బాట పట్టాయి. మొబైల్ యాప్స్, యూట్యూబ్, వర్చువల్ తరగతుల ద్వారా పాఠాలు బోధిస్తూ అటు విద్యార్థులకు లాభదాయకంగా మారడమే కాక… ఇటు సొంత ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నాయి.

ఇక ప్రభుత్వం కూడా ఈ-లెర్నింగ్ క్లాసులు ప్రారంభించాయి. టీ-శాట్ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ పాఠశాల విద్యార్థుల మిగిలిన సిలబస్ పూర్తి చేస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థులకు పునశ్చరణ తరగతులు కూడా నిర్వహిస్తోంది. కాగా, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ టీ-శాట్ పూర్తిగా ఉచితమే.

విద్యార్థులు ఈ లాక్‌డౌన్ కాలాన్ని వృధా చేయకుండా ఆన్‌లైన్ తరగతుల ద్వారా కొత్త పాఠాలు నేర్చుకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉపయోగపడుతుందని.. పోటీ పరీక్షలకు కూడా సిద్దమయినట్లు ఉంటుందని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News