28 లక్షల ఆసుపత్రి బిల్లు.... సాయం కోసం కేటీఆర్‌కు ట్వీట్‌

కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసుల ఆసుపత్రులే అని మరోసారి నిజమైంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 60 ఏళ్ల డి.వెంకట్‌రావు మార్చి 18న హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. అయితే ఆయనకు కరోనా సోకిందనే అనుమానంతో రెండు సార్లు టెస్టు చేశారు. రెండుసార్లు నెగటివ్‌ వచ్చింది. కరోనా నెగటివ్‌ రావడంతో వెంటనే ఇతర టెస్టులు చేశారు. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్‌ సోకిందని డయాలసిస్‌ చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారని…రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని డాక్టర్లు […]

Advertisement
Update:2020-04-08 15:00 IST

కార్పొరేట్‌ ఆసుపత్రులు కాసుల ఆసుపత్రులే అని మరోసారి నిజమైంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో 60 ఏళ్ల డి.వెంకట్‌రావు మార్చి 18న హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. అయితే ఆయనకు కరోనా సోకిందనే అనుమానంతో రెండు సార్లు టెస్టు చేశారు. రెండుసార్లు నెగటివ్‌ వచ్చింది.

కరోనా నెగటివ్‌ రావడంతో వెంటనే ఇతర టెస్టులు చేశారు. కిడ్నీల్లో ఇన్ఫెక్షన్‌ సోకిందని డయాలసిస్‌ చేశారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నారని…రెండు రోజుల్లో డిశ్చార్జ్‌ చేస్తామని డాక్టర్లు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఆయనకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ సోకిందని… ఆయన కండీషన్‌ సీరియస్‌గా ఉందని ఏప్రిల్‌ 6న కుటుంబసభ్యులకు డాక్టర్లు చెప్పారు. చివరకు ఏప్రిల్‌ 7న ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.

వెంకటరావు చనిపోయిన తర్వాత ఆ డెడ్‌బాడీ అప్పగించేందుకు బిల్లు కడితేనే ఇస్తామని ఆసుపత్రి షరతు పెట్టింది. బిల్లు చూస్తే మొత్తం 28 లక్షల 17 వేల 733 రూపాయలు అయింది. వెంకటరావు కొడుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. అప్పటికే ఆయన 20లక్షలకు పైగా బిల్లు చెల్లించారు. మిగతా 8 లక్షలు కడితేనే డెడ్‌బాడీ ఇస్తామని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.

ఊపిరితిత్తుల ఇన్పెక్షన్‌తో ఆసుపత్రిలో చేరితే మొదట నాలుగు రోజులు ఎటువంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వలేదని….కరోనా టెస్టులకు మాత్రమే శాంపిల్స్‌ పంపించారని వెంకటరావు బంధువు హరీష్‌ చెప్పారు. కేవలం అబ్జర్వేషన్‌ అంటూ నాలుగు రోజులు గడిపారని…ఆ తర్వాత లో బీపీ అంటూ బ్లడ్‌ కావాలని అడిగితే ఫ్రెండ్స్‌ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత బీపీ తగ్గుతూ…పెరుగుతుందని…కిడ్నీ పనితీరు దెబ్బతిందని..డయాలసిస్‌ చెయ్యాలని అన్నారట. ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ క్యూర్‌ అయిందని చెప్పారట. తీరా చూస్తే సోమవారం పరిస్థితి క్షీణించిందని చెప్పి….ఒక రోజు గడిచిన తర్వాత చనిపోయారని డాక్టర్లు చెప్పారట.

ఒక వైపు ప్రాణాలు పోయాయి. మరోవైపు బిల్లు చూస్తే 28 లక్షలు దాటింది. అప్పటికే 20 లక్షలు కట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని చూశారు. వారు ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో….వెంటనే ట్వీట్టర్‌లో కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టారు. సాయం చేయాలని రిక్వెస్ట్‌ కోరారు. దీంతో వెంటనే స్పందిచిన ఆయన…..తన ఆఫీసు సిబ్బందిని సమస్యను పరిష్కరించాలని కోరారు.

కేటీఆర్‌ ఆఫీస్‌ జోక్యం చేసుకోవడంతో… తమకు క్షమాపణలు చెబుతూ లేఖ ఇస్తే డెడ్‌బాడీ ఇస్తామని ఆసుపత్రి సిబ్బంది షరతు పెట్టింది. చివరకు హాస్పిటల్‌ సీఈవో జోక్యం చేసుకుని.. తనవల్ల సమస్య సాల్వ్‌ అయిందని ట్వీట్‌ చేయాలని కోరారు. దీంతో అంగీకరించిన బంధువులు సీఈవో వల్ల సమస్య తీరిందని చెప్పి….ట్వీట్‌ చేశారు. అయితే ఈ కథనంపై ఆసుపత్రి వర్గాలను సంప్రదిస్తే ఎలాంటి స్పందన లేదు.

Tags:    
Advertisement

Similar News