ఈ 2 లక్షణాలు ఉంటే కరోనా కావొచ్చు... జాగ్రత్త పడండి
ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా.. ముక్కు కారినా.. శారీరకంగా ఎలాంటి అస్వస్థతకు గురైనా.. కరోనానే కావచ్చన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతూనే ఉంది. ఎవరైనా తుమ్మారంటే అంతే.. అందరి చూపు ఆ వ్యక్తి వైపే ఉంటోంది. అంతగా.. కరోనా ప్రభావం జనాలను కుదిపేస్తోంది. ఇలాంటి లక్షణాలు మాత్రమే కాదు. ఈ 2 లక్షణాలు కనిపించినా కూడా.. జనాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైద్యులు చెబుతున్న ప్రకారం.. […]
ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా.. ముక్కు కారినా.. శారీరకంగా ఎలాంటి అస్వస్థతకు గురైనా.. కరోనానే కావచ్చన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతూనే ఉంది. ఎవరైనా తుమ్మారంటే అంతే.. అందరి చూపు ఆ వ్యక్తి వైపే ఉంటోంది. అంతగా.. కరోనా ప్రభావం జనాలను కుదిపేస్తోంది. ఇలాంటి లక్షణాలు మాత్రమే కాదు. ఈ 2 లక్షణాలు కనిపించినా కూడా.. జనాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.
హైదరాబాద్ లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైద్యులు చెబుతున్న ప్రకారం.. కళ్ల కలకతో పాటు.. కాస్త జ్వరం వచ్చిందంటే.. వెంటనే అప్రమత్తం కావాల్సిందే. ఎందుకంటే.. కొన్ని రకాల వైరస్ ల కారణంగానే కళ్ల కలక వస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొన్నాళ్ల పాటు ఆ సమస్య వేధించి.. తర్వాత అదే తగ్గిపోతుంది. అది.. సదరు మనిషి రోగ నిరోధక శక్తి ఆధారంగా ఉంటుంది. కానీ.. ఇది కరోనా కాలం కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
కళ్ల కలకతో పాటు.. జ్వరం వచ్చిందంటే.. అది కరోనా అయ్యే అవకాశాలు 90 శాతం వరకూ ఉంటాయని సరోజినీ దేవి ఆసుపత్రి డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు.. చైనాలో జరిగిన ఓ ఘటననూ ఉదహరిస్తున్నారు. కరోనా పుట్టిన వుహాన్ లోనే.. ఓ వ్యక్తికి కళ్ల కలక వస్తే.. అక్కడి డాక్టర్ కరోనా అయి ఉంటుందని అనుమానించారట. ప్రభుత్వానికీ నివేదించారట. కానీ.. అక్కడి ప్రభుత్వం ఆ సూచనను లైట్ తీసుకున్న కారణంగా.. తర్వాత బాధపడి లాభం లేకుండా పోయిందని వైద్యులు చెబుతున్నారు.
అందుకే.. ప్రజలంతా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని… కళ్ల కలక ఉంటే వెంటనే వైద్యులను కలవండి అని చెబుతున్నారు. జ్వరం కూడా తోడైందంటే.. తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండని…. అది మీకూ, మీ కుటుంబానికి మాత్రమే కాదు.. దేశానికీ ఎంతో మంచిందని కోరుతున్నారు.