తమిళనాడులో అలర్ట్.... ఒక్కసారిగా పెరిగిన కేసులు
తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. దాదాపు 26 జిల్లాల్లో మహమ్మారి ఇప్పుడు ప్రతాపం చూపుతోంది. ఇప్పటివరకు 309 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశం లో కరోనా బాధిత రాష్ట్రాలలో తమిళనాడు సెకండ్ ప్లేస్‌కి చేరింది. మొన్నటి వరకూ అక్కడ పెద్దగా కేసులు లేవు. విదేశాలనుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఢిల్లీ మర్కజ్ లింక్‌లతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. 48 గంటలలో ఢిల్లీ నుండి వచ్చిన 264 మందికి కరోనా పాజిటివ్ […]
తమిళనాడులో కరోనా పంజా విసురుతోంది. దాదాపు 26 జిల్లాల్లో మహమ్మారి ఇప్పుడు ప్రతాపం చూపుతోంది. ఇప్పటివరకు 309 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశం లో కరోనా బాధిత రాష్ట్రాలలో తమిళనాడు సెకండ్ ప్లేస్‌కి చేరింది. మొన్నటి వరకూ అక్కడ పెద్దగా కేసులు లేవు. విదేశాలనుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కనిపించింది. కానీ ఇప్పుడు ఢిల్లీ మర్కజ్ లింక్‌లతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి.
48 గంటలలో ఢిల్లీ నుండి వచ్చిన 264 మందికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో తమిళనాడులో ఆందోళన నెలకొంది. ఈ 264 మంది ఎవరెవరితో కలిశారు? వారు ఎక్కడెక్కడ తిరిగారు? అనే డిటైల్స్ తీస్తున్నారు. దాదాపు 1130 మంది వరకు ఢిల్లీ వెళ్లిరావడం తో పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఆచూకీ లేని 600 మందికి 24 గంటలలో వివరాలు తెలుసుకొని వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రం లో అత్యధికం గా చెన్నై లో 46 మందికి, ఈరోడ్ లో 32, తిరునల్వేలి లో 30, కోయింబత్తూర్ లో 29, తేని లో 20, నామక్కల్ లో 18, చెంగల్పట్టు జిల్లాలో 18 కేసులు నమోదు అయ్యాయి. కలెక్టర్, మున్సిపల్ అధికారులు, పోలీసుల లాక్ డౌన్ పనితీరుపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ చర్యలు మరింత కఠినం గా ఉండాలని, అనవసరం గా బయట కి వస్తే వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.