ఏపీలో నిబంధనలు మరింత కఠినతరం " సీఎం వైఎస్ జగన్
కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఏపీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఇష్టానుసారం రోడ్లపైకి వస్తున్నారని సీఎం దృష్టికి రావడంతో ఇవాళ మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ పలు శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల పేరుతో బయట తిరగడం ఎక్కువైంది కనుక ఇకపై పట్టణాల్లో ఉదయం 6 నుంచి 11 […]
కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండటంతో ఏపీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు లాక్‌డౌన్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఇష్టానుసారం రోడ్లపైకి వస్తున్నారని సీఎం దృష్టికి రావడంతో ఇవాళ మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆదివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ పలు శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిత్యావసరాల పేరుతో బయట తిరగడం ఎక్కువైంది కనుక ఇకపై పట్టణాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు తెరిచి ఉంచాలని నిర్ణయించారు.
ప్రజలు కూడా ఆ సమయంలో తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరించారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మితే వ్యాపారులను జైలుకు పంపాలని సీఎం ఆదేశించారు. ప్రతీ దుకాణం వద్ద, కూరగాయల షాపు వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. ఆ ధరకంటే ఎక్కువకు అమ్మితే ప్రజలు కాల్ సెంటర్‌కు పిర్యాదు చేయాలని.. ఆ నెంబర్ కూడా అక్కడ రాయాలని అధికారులకు చెప్పారు.
రేషన్ షాపుల వద్ద ఉచిత సరుకులు పంపిణీ చేస్తున్న కారణంగా అక్కడ జనాలు గుమికూడకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు.