నేడు కరోనాపై కేసీఆర్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలు?
కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైన నేపథ్యంలో… ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత వారం రోజుల లాక్‌డౌన్ అమలు తీరు, ప్రజల స్పందన, కరోనాపై చైతన్యం తదితర అంశాలపై చర్చించి…. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్యం, […]
కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైన నేపథ్యంలో… ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
గత వారం రోజుల లాక్‌డౌన్ అమలు తీరు, ప్రజల స్పందన, కరోనాపై చైతన్యం తదితర అంశాలపై చర్చించి…. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
అత్యవసర సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా కట్టడి, పంట కొనుగోళ్లే ప్రధాన అంశంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్ వల్ల ఉత్పన్నమయిన సమస్యలపై చర్చిస్తారు. నిత్యావసరాల లభ్యత, ధరలపై కూడా సీఎం ఆరాతీయనున్నట్లు సమాచారం.
గ్రామాల్లో పంట కొనుగోళ్ల క్యాంపుల ఏర్పాటును కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున్న మార్కెట్ యార్డులన్నీ తాత్కాలికంగా మూసేశారు. దీంతో మార్కెటింగ్ శాఖ సిబ్బందే ప్రతీ గ్రామంలో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
గతంలో ధాన్యం సేకరణ కోసం 4,028 కేంద్రాలు ఉండగా… ఈ సారి 6,700 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను అధికారులు కేసీఆర్‌కు తెలియజేయనున్నారు. ఈ రెండు సమీక్షల అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.