ధోని భార్య vs నెటిజన్లు

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కరోనా వైరస్ తాజాగా ఇండియాలోనూ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉండగా కరోనా నివారణకు పలువురు సెలబ్రెటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను అందిస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని కరోనా బాధితుల కోసం లక్ష రూపాయాల విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ధోని ఆర్థికసాయంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ధోని […]

Advertisement
Update:2020-03-28 05:51 IST

ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న కరోనా వైరస్ తాజాగా ఇండియాలోనూ వేగంగా విజృంభిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉండగా కరోనా నివారణకు పలువురు సెలబ్రెటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలను అందిస్తూ తమవంతు సహకారం అందిస్తున్నారు.

తాజాగా ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని కరోనా బాధితుల కోసం లక్ష రూపాయాల విరాళం ప్రకటించినట్లు తెలుస్తోంది. ధోని ఆర్థికసాయంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

ధోని టీమిండియా కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా దేశానికి అనేక మరుపురాని సేవలందించారు. అదేవిధంగా క్రికెట్ ద్వారా కోట్లాది రూపాయాలను సంపాదించారు. ప్రస్తుతం ధోని నికర ఆస్తి రూ.800కోట్లు. దేశంలో క్రికెట్ ద్వారా అత్యధికంగా సంపాదించే క్రికెటర్లలో ధోని ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే కరోనా బాధితులను ఆదుకునేందుకు పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. ఆట ద్వారా పెద్దమొత్తంలో సంపాదించే ధోని కేవ‌లం ల‌క్ష రూపాయ‌లు విరాళం ఇవ్వ‌డం ఏంట‌ని నెటిజన్ లు ట్రోలింగ్ చేస్తున్నారు. ధోనిపై సోషల్ మీడియాలో పలువురు ఇష్టంవచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ధోనీ భార్య సాక్షి ఈ కామెంట్లపై ఘాటుగానే స్పందించారు. తన భర్తపై తప్పుడు ప్రచారం చేసేవారికి సిగ్గుండాలంటూ పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో జర్నలిజం దిగజారిపోవడం ఆవేదన కలిగిస్తుందన్నారు.

నెటిజన్ ల పై ట్విట్టర్ ద్వారా ఆమె కూడా తిట్ల దండ‌కానికి దిగారు. అయితే ధోని ఎంత విరాళం ఇచ్చార‌నే విష‌యాన్ని మాత్రం సాక్షి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ధోని భార్య నెటిజన్ లపై ఫోర్లు, సిక్సర్లు కొడుతుండగా ధోని మాత్రం సైలెంట్ అయిపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియడం లేదు.

Tags:    
Advertisement

Similar News