కరోనా ఎఫెక్ట్: మద్యం, సిగరెట్ ల బ్లాక్ దందా

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఆవహించింది. మోడీ సర్కార్ లాక్ డౌన్ విధించింది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలు లేదు. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. భారీగా ఇళ్లలో మద్యం నిల్వలను ఏర్పాటు చేసుకొని మందు, విందులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నగరాలు, పట్టణాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులు…. ఇతర స్టార్ హోటళ్లు, పబ్ యజమానులతో సాన్నిహిత్యం ఏర్పరుచుకొని కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లను తీసుకుంటున్నారు. పబ్బులు మూసివేసినప్పటికీ , యజమానులు తమ ఇళ్లలోకి […]

Advertisement
Update:2020-03-28 06:06 IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఆవహించింది. మోడీ సర్కార్ లాక్ డౌన్ విధించింది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీలు లేదు. దీంతో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు. భారీగా ఇళ్లలో మద్యం నిల్వలను ఏర్పాటు చేసుకొని మందు, విందులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

నగరాలు, పట్టణాల్లోని ఉన్నత స్థాయి వ్యక్తులు…. ఇతర స్టార్ హోటళ్లు, పబ్ యజమానులతో సాన్నిహిత్యం ఏర్పరుచుకొని కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లను తీసుకుంటున్నారు. పబ్బులు మూసివేసినప్పటికీ , యజమానులు తమ ఇళ్లలోకి మద్యం నిల్వలు తరలించుకొని బ్లాక్ మార్కెట్ లో భారీగా అమ్ముకుంటున్నారట. ఒక్కో బాటిల్ ను డబుల్ ధరకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారట. స్కాచ్ బాటిల్స్ అయితే వేలు పలుకుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్ వరకు కూడా లాక్ డౌన్ తప్పకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం అయిపోయినవారు ఇలా బయట బ్లాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు.

ఇదే అదునుగా బార్ లు, వైన్స్ షాపుల వారు బ్లాక్ మార్కెట్ లో మద్యం ను భారీ ధరలకు అమ్ముతున్నారు. కల్తీ మద్యంను కూడా మందుబాబులకు అమ్ముతున్నారు.

మద్యానికి బానిస అయిన వారు ఎంత ధర అయినా పెట్టి కొంటున్నారు. కల్తీ మద్యం అంటగడుతుండడంతో వారికి వికారం, అలసట, నిద్రలేమి, తలనొప్పి, చెమట, అధిక రక్తపోటు తదితర లక్షణాలతో ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.

లాక్ డౌన్ లో మద్యం బాబులు సుబ్బరంగా మద్యానికి దూరమైతే మంచిది. మద్యపానం అలవాటును దూరం చేసుకుంటే మరికొంత కాలం బతుకుతారని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక దూమపాన ప్రియులకు కష్టాలొచ్చాయి. కిరాణా షాపుల్లో సిగరెట్లు అమ్మడం లేదు. పాన్ డబ్బాలు అన్నీ మూసివేశారు. వారు కూడా సిగరెట్లు దొరక్క పిచ్చెక్కిపోతున్న పరిస్థితి నెలకొంది.

లాక్ డౌన్ కారణంగా సిగరెట్, మద్యంకు దూరంగా ఉండడం జనాలకు మంచి చేస్తుంది. ఇప్పుడు కనుక మద్యం తాగితే కల్తీకి ప్రాణాలు పోతాయి. బ్లాక్ మార్కెట్ లో కొని అనవసరంగా ఇల్లు గుల్ల చేసుకోకండని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News